Adhurs : అన్నీ చోట్ల షోస్ క్యాన్సిల్..’అదుర్స్’ రీ రిలీజ్ కి దారుణమైన రెస్పాన్స్!

- Advertisement -

Adhurs : గత ఏడాది లో ప్రారంభమైన రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ కొత్త సినిమాలను సైతం వణుకు పుట్టేలా చేసింది. మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాదు, కొంతమంది మీడియం రేంజ్ హీరోల సూపర్ హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. కానీ ఇప్పుడు చిన్నగా రీ రిలీజ్ ట్రెండ్ క్రేజ్ తగ్గిపోతున్నట్టుగా తెలుస్తుంది.

Adhurs
Adhurs

ప్రభాస్ పుట్టినరోజు కి విడుదల చేసిన ‘ఛత్రపతి’ కి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రీ రిలీజ్ అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది,రీ రిలీజ్ సినిమాల సందడి ఇక ఆగిపోయినట్టే అని. కానీ అదుర్స్ చిత్రానికి అన్నీ వర్గాల నుండి మంచి క్రేజ్ ఉండడం తో ఈ చిత్రం కచ్చితంగా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతుందని అందరూ అనుకున్నారు. ఆ నమ్మకం తోనే ఈ చిత్రాన్ని నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రీ రిలీజ్ అయ్యింది.

కానీ రెస్పాన్స్ మాత్రం అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. వారం రోజుల ముందే మెయిన్ సెంటర్స్ అన్నిట్లో ఈ చిత్రం రీ రిలీజ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం రెండు హౌస్ ఫుల్స్ మాత్రమే పడింది. ఎన్టీఆర్ రేంజ్ కి ఇది అవమానకరమే. ఓవరాల్ ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

- Advertisement -

విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ప్లాన్ చేసిన షోస్ మొత్తం క్యాన్సిల్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా విజయవాడ లో అయితే అలంకార అనే థియేటర్ లో తప్ప, మిగిలిన థియేటర్స్ అనీ కలిపి పది టిక్కెట్టుకూడా అమ్ముడుపోలేదు. ఇదే అందరినీ షాక్ కి గురి చేసిన విషయం. దీంతో థియేటర్స్ ఓనర్స్ షోస్ క్యాన్సిల్ చేసారు. అలా ఈ అదుర్స్ రీ రిలీజ్ కి ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే, ఫ్యాన్స్ ఇక మీదట రీ రిలీజ్ సినిమాల మీద ఆసక్తి చూపడం ఆపేస్తున్నారా అనే సందేహం అందరిలో మొదలైంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here