Anasuya : అనసూయ జబర్దస్త్ మానేయడానికి గల అసలు కారణాన్ని చెప్పిన అభి.. అంతా రష్మినే చేసిందట..

- Advertisement -

Anasuya : జబర్దస్త్’ ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అదిరే అభి కూడా ఒకరు. ‘జబర్దస్త్’ లో కమెడియన్ గా పాపులర్ అయిన అభి ఆ క్రేజ్ తో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే తనకు కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చిన ‘జబర్దస్త్’ నుంచి కొద్దికాలం బయటకు వచ్చేసాడు. రెమ్యునరేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్న అభి ‘జబర్దస్త్’ షో కి గుడ్ బై చెప్పినట్లు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి.

Anasuya
Anasuya

‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేసిన అభి ఆ తర్వాత ‘స్టార్ మా’లో ప్రసారమైన ‘కామెడీ స్టార్స్’ షోలో సందడి చేశాడు. అక్కడ కూడా తనదైన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిరే అభి ‘జబర్దస్త్’ గురించి అనసూయ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనసూయ, రష్మిలకి ‘జబర్దస్త్’, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ టీమ్స్ ఎలా డివైడ్ చేశారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అభి బదులిస్తూ..

“జబర్దస్త్‌కు మొదట అనసూయ యాంకర్ గా చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వేరే పనిమీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రష్మీ వచ్చింది. రష్మి వచ్చిన కొన్ని రోజులకి ‘జబర్దస్త్’, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ రెండు వచ్చాయి. అప్పుడు రెండు షోస్ ని కూడా రష్మీనే హ్యాండిల్ చేసింది. కానీ ఎప్పుడైతే అనసూయ వచ్చిందో అప్పుడు ‘జబర్దస్త్’ అనసూయకు, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ రష్మీకి ఇచ్చి ఇద్దరికీ ఒక్కో ఎపిసోడ్ లాగా ఇచ్చారు” అని అన్నాడు. ఆ తర్వాత అనసూయ ‘జబర్దస్త్’ నుంచి ఎందుకు వెళ్లిపోయారు? అని అడగగా.. “నాకు తెలిసి తను మెటర్నిటీ కోసం వెళ్ళిపోయారు. బయట చాలా రూమర్స్ వచ్చాయి. అవి ఏమి నిజం కాదు. బయట రాసుకునే వాళ్ళు చాలా రాసుకుంటారు. తను మెటర్నిటీ గురించే ‘జబర్దస్త్’ నుంచి వెళ్లిపోయారు” అని తెలిపారు అభి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here