సినిమాల్లో అమ్మ , అక్క , అత్త పాత్రలు అంటే మనకి గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరు ప్రగతి. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు ప్రాంతానికి చెందిన ప్రగతి 2002 వ సంవత్సరం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన బాబీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ, అదే సంవత్సరం లో వచ్చిన ‘నువ్వే నువ్వే’ చిత్రం ఈమె కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్టు మీద హిట్టు కొడుతూ కేవలం రెండు దశాబ్దాలలోనే 200 సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసింది. ఇప్పుడు ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో నటించింది, ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
ఇది ఇలా ఉండగా ప్రగతి సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె తన వర్కౌట్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యింది, అలాగే ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని సంఘటనలపై చాలా బోల్డు గా కామెంట్స్ చేస్తుంది. రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ స్టార్ కమెడియన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘ఒక ప్రముఖ స్టార్ కమెడియన్ నాతో ఎంతో మంచిగా, గౌరవంతో ఉంటాడు. నన్ను చాలా అభిమానిస్తాడు, కానీ ఒక రోజు ఆయన ప్రవర్తన నాకు చాలా తేడాగా అనిపించింది. ఆరోజు సాయంత్రం అయ్యేలోపు ఆయన వర్క్ మొత్తం పూర్తి అయ్యి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు, అప్పుడు నేను ఆయనని పిలిచి నా క్యారవాన్ లోకి తీసుకెళ్లి ఒకటి అడిగాను.
సార్ ఎప్పుడైనా నేను మీతో తప్పుగా ప్రవర్తించానా?, అంటే నేను ప్రవర్తించే తీరులో , నా చూపు పరంగా కానీ మిమల్ని పరోక్షంగా ఏమైనా ఆహ్వానించినట్టు అనిపించిందా అని అడిగాను, అప్పుడు ఆయన అయ్యో ఏంటమ్మా , కరెక్ట్ కాదు కదా అది మీరు నావైపు ఆ ఉద్దేశ్యం తో చూడడం, ఒకవేళ నేను రియాక్ట్ అయ్యుంటే ఏంటి పరిస్థితి అని అన్నాడు.అప్పుడు నేను సడన్ గా నావైపు నేను ఏమైనా తప్పు చేసానా అనే కన్ఫర్మేషన్ కోసమే అడిగాను’ అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు ఏమిటి అనేది బయట పెట్టలేదు ప్రగతి.