Pavala Syamala : కమెడియన్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోతో బుల్లి తెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ హైపర్ ఆది ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి సీనియర్ నటి పావలా శ్యామల.. కమెడియన్ హైపర్ ఆది పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జబర్దస్త్ షోలో ఓ స్కిట్లో భాగంగా తనను చనిపోయిన వాళ్ల ఫోటో పక్కన పెట్టి చనిపోయినట్లు చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి స్కిట్లు చూసినప్పుడు చాలా బాధగా అనిపించిందని తెలిపింది.

టాలీవుడ్లో పావలా శ్యామల ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె గత కొద్దిరోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈమె తన కూతురు ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని తెలిపింది. తాజాగా జబర్దస్త్ షో ఆమె స్పందించింది. జబర్దస్త్ లాంటి షోలు చనిపోయిన వాళ్ల ఫోటో పక్కన తన ఫోటో పెట్టడం చూస్తే నిజంగానే చాలా సార్లు చనిపోయామేమో అన్న భావన అందరికీ కలిగించేలా చేస్తున్నారని ఆవేదన చెందింది.

ఒక స్కిట్లో హైపర్ ఆది.. సినియర్ యాక్టర్లు నిర్మలమ్మ, మనోరమ ఫోటోల పక్కన తన ఫోటో పెట్టి.. ఈవిడ ఎవరో తెలుసా.. ఈవిడ కూడా ఇప్పుడు లేరన్నంత చెప్పేశారు. పోయిన వాళ్ల ఫోటో పక్కన తన ఫోటో ఉంచి ఇలా చెప్పడం సరికాదు.. ప్రస్తుతం నేడు నడవలేని స్థిలో ఉన్నాను. అయినా నేను జబర్ధస్త్ షో ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని వెళ్లి ఎందుకు ఇలా చేశావు.. నీతో ఎవరు ఇలా చేయించారని హైపర్ ఆది కాలర్ పట్టుకుని అడగాలనుకుంటున్నాను. కనీసం తను బతికున్నానో లేదో తెలుసుకోకుండా.. ఆ విషయం ఫోన్ చేసైనా అడగకుండా ఇలా చేయడం చాలా దారుణం అంటూ చెప్పుకొచ్చింది.