Anukunnavanni Jaragavu Konni Trailer Review : కొత్త హీరో అదరగొట్టేసాడు!

- Advertisement -

Anukunnavanni Jaragavu Konni Trailer Review : ఈ ఏడాది ఊరు పేరు తెలియని హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో సక్సెస్ అవ్వడం మనమంతా గమనించాము. పెద్ద హీరోల సినిమాలు అంచనాలను అందుకోలేక వరుసగా అట్టర్ ఫ్లాప్స్ అవుతున్న ఈ సందర్భం లో చిన్న సినిమాలే చిత్ర పరిశ్రమని ఆకట్టుకున్నాయి. అలా చిన్న సినిమాల సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించే విధంగా రీసెంట్ గా విడుదలైన ‘అనుకున్నవన్నీ జగవు కొన్ని’ ట్రైలర్ ఉన్నది.

Anukunnavanni Jaragavu Konni Trailer Review
Anukunnavanni Jaragavu Konni Trailer Review

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మంచి యూత్ ఫుల్ మరియు థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమా లాగ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కొత్తవాళ్లే, కానీ సినిమాలో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. పోసాని కృష్ణ మురళి ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ లోని హైలైట్ విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.

ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ చాలా చక్కగా ఉన్నాయి. మొదటి సినిమానే అయ్యినప్పటికీ డైరెక్టర్ జి.సందీప్ చాలా చక్కగా రాసాడు. హీరో హీరోయిన్లు గా నటించిన శ్రీ రామ్ నిమ్మల మరియు కలపాలి మౌనిక ఇద్దరు కూడా తొలి సినిమా అయ్యినప్పటికీ చాలా పరిణీతి ఉన్నవారి లాగ నటించారు. ట్రైలర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఒక చిన్న సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇంత క్వాలిటీ గా ఉండడం ఈమధ్య కాలం లో జరగలేదు.

- Advertisement -
Allari naresh Sriram

ట్రైలర్ చూస్తుంటే అనుకోకుండా ఒక మర్డర్ కేసు లో చిక్కుకున్న ఒక జంట ఎలా ఆ మర్డర్ కేసు నుండి బయటపడింది, ఈ కేసు లో వారిని ఇరికించిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఇలా చేసారు?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. చిన్న సినిమాలు పీక్ రేంజ్ ని చూస్తున్న ఈ రోజుల్లో, ఈ చిన్న సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here