నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిత్య మీనన్. అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్‌తో అవకాశాలను అందుకుంది. కొన్ని చిత్రాలలో పాటలు పాడి కూడా తన టాలెంట్‌ని చూపించింది నిత్యామీనన్. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇలా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక చాలారోజులు గ్యాప్ తీసుకున్నాక ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

అటు ఓటీటీలో కూడా నిత్య హడావిడి చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది నిత్యామీనన్. ఈ షో ద్వారా మరింత పాపులారిటీని మూటగట్టుకుంది నిత్యామీనన్. అయితే నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్‌పై తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇవి కాస్త దుమారం రేపాయి. కాగా, ఇండస్ట్రీలో ఇప్పటికి చాలామంది నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించిన విషయం తెలిసిందే. చాలామంది హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి పలు ఇంటర్వ్యూలలో కూడా తమకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తెలియజేశారు.

ఇప్పుడు నిత్యామీనన్ కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ఇక ఈ అమ్మడు పెళ్లి గురించి కూడా చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల పై కూడా నిత్యామీనన్ స్పందించింది. కామాంధులు అన్నిరంగాల్లోనూ ఉంటారని కానీ టాలీవుడ్‌లో మాత్రం తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పింది. అయితే తమిళ్‌లో ఓ సినిమా చేసేప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
షూటింగ్ సమయంలో ఆ సినిమా హీరో తనని బాగా వేధించాడని చెప్పుకొచ్చింది. అసభ్యంగా తాకుతూ పిచ్చిగా ప్రవర్తించాడని తెలిపింది. దీంతో నిత్యామీనన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం నిత్యామీనన్ వెల్లడించలేదు. ఇక ఆ హీరో ఎవరై ఉంటాడా అని నెటిజన్లు ఇంటర్నెట్‌లో క్లూల కోసం తెగ వెతికేస్తున్నారు.