Actress Love Gossips : సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడుతూ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆఫర్లు వరుస కట్టాక ఇక వారు వారి పర్సనల్ లైఫ్‌ని కాస్త పక్కకి పెట్టేస్తారు. ప్రేమ, పెళ్లి గురించి అడిగితే ముందు కెరీర్ అంటూ ఉంటారు.
ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ సంగతి తెలిసిందే కదా.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. అందం, ఆఫర్లు ఉన్నన్ని రోజులు కష్టపడాల్సిందే. అయితే కెరీర్ బిజీలో పడి తమ పర్సనల్ లైఫ్‌లో ప్రేమను చాలా మంది హీరోయిన్లు పక్కనబెట్టేస్తారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రేమ గురించి అడిగినా.. మాట్లాడినా.. తమకు కూడా టీనేజ్‌లో ఓ చిన్న లవ్‌స్టోరీ ఉండేదని చెబుతుంటారు. అలా టీనేజ్లోనే ప్రేమలో పడ్డ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి..
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉంది. అయితే ఈ క్యూటీ 15 ఏళ్ల వయసులోనే ఓ అబ్బాయిని తెగ ఇష్టపడిందట. ఆ కుర్రాడిపై టీనేజ్‌లో ప్రేమ పుట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ క్రాక్ బ్యూటీ. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చాక హీరో సిద్ధార్థ్, ధనుశ్లతో శ్రుతి ఎఫైర్ నడిపినట్లు పుకార్లు వచ్చాయి అప్పట్లో. ఇక లండన్‌కు చెందిన మైఖేల్ కోర్ల్సేతో కొన్నాళ్లు శ్రుతి డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం ముంబయిలో డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికతో లివి ఇన్ రిలేషన్షిప్లో ఉంది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఇంటర్‌లోనే ప్రేమలో పడిందట. ఇంటర్మీడియట్లో తన క్లాస్మెట్ని కియారా తెగ ఇష్టపడిందట. ఆ విషయంలో ఇంట్లో తెలిసి పేరెంట్స్ కట్టడి చేశారట. ఎలాగైనా అతడిని కలవాలని కంబైన్ స్టడీ కోసం ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నానని అబద్దం చెప్పి రహస్యంగా కలిసేదట ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక.. తన కోస్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.
సొట్టబుగ్గల చిన్నది.. దిల్లీ డాల్.. తాప్సీ పన్ను కూడా టీనేజ్లోనే ప్రేమలో పడిందట. 14 ఏళ్ల వయసులో తన ఫస్ట్ లవ్ మొదలైందని చెప్పిందీ భామ. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాతియాస్ బోయ్తో లవ్‌లో ఉన్నట్లు ముంబయి మీడియా కోడై కూస్తోంది.
హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా సగటు అమ్మాయిలా ప్రేమలో తొందర పడిందట. అయితే ఈ బ్యూటీ కాస్త అడ్వాన్స్. ఏకంగా 4వ తరగతిలోనే ఒక అబ్బాయిని ఇష్టపడిందట. టాలీవుడ్, బాలీవుడ్‌లలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కొన్నాళ్లు ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్ చేసినట్లు సమాచారం.
ఇక టాలీవుడ్ స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ ప్రేమ మొదలైంది టీనేజ్లోనే. లవ్ ఎట్ ఫస్ట్ ఈ బ్యూటీది. మొదటి చూపులోనే ప్రేమలో పడిన సుశాంక్ భరద్వాజ్‌నే పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లికి పెద్దలను ఒప్పించడానికి ఈ బ్యూటీ పెద్ద యుద్ధమే చేశానని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.