Pawan Kalyan : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఊహించని స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎంతోమంది అభిమానుల హృదయాలను సొంతం చేసుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈయన తన ఉదార మనసుతో ఎంతో మంది ప్రజల మన్ననలను కూడా పొందుతున్నారు. కష్టం వచ్చిన వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు సమానంగా ప్రాధాన్యత ఇస్తూ రెండు రంగాలలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటి లిరీష ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన లిరీష ఆయనతో కలిసి పని చేసినప్పుడు తన అనుభవాలను పంచుకుంది. లిరీష మాట్లాడుతూ ఎంతోమంది హీరోలకు అభిమానులు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న స్థాయిలో డైహార్డ్ ఫాన్స్ మాత్రం ఏ ఒక్క హీరోకి లేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్ కి భయంకరమైన అభిమాన ఫాలోయింగ్ ఉంది. దేవుడి తర్వాత దేవుడితో సమానంగా అభిమానులు కొలిచే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ లిరిష చెప్పుకొచ్చింది.
ఇక తాను కూడా పవన్ కళ్యాణ్ డై హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పిన ఈమె.. ఇక తనకు రాజకీయ అనుభవం లేదు అని అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి తాను మాట్లాడకుండా ఉండడమే బెటర్ అని కూడా తెలిపింది.పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటారని.. ఏ విషయంలో కూడా ఆయన అంత హంగు ఆర్భాటం చేయరు అని చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులో భారీ విజయాలను దక్కాలని అభిమానులు భావిస్తున్నారు అంటూ లిరీష తెలిపింది. మొత్తానికైతే లిరీష పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ సంభోదించి ఆయన అభిమానుల మన్ననలను పొందుతోంది.