krithi Shetty : డేంజర్ జోన్ లో కృతి శెట్టి.. ఆమె వల్లే కెరీర్ నాశనం అవుతుందా..

- Advertisement -

krithi Shetty : ఉప్పెన సినిమాతో ఉప్పెలా టాలీవుడ్ పై పడింది కృతీ శెట్టి.. తన సొగసులతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సునామీ సృష్టించిన ఈ బ్యూటీ… ఒక్క సినమాతోనే వరుస అవకాశాలు సాధించింది. స్టార్ హీరోల సినిమాలననీ తన గుమ్మం ముందు ఎదురు చూసేలా చేసుకుంది బ్యూటీ అంతే కాదు.. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి..హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా..లక్కీ స్టార్ గా మారిపోయింది. ఇక కృతి శెట్టి కెరీర్ కు ఏమాత్రం డోకా లేదు అనుకున్నారు సినీ జనాలు. కథల విషయంలో కూడా ఈ బ్యూటీ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా దక్కినట్టే అని అనుకున్నారు. అంతే కాదు కృతి శెట్టి తరువాత శ్రీలీల లాంటి తారలు వచ్చినా.. ఆమె సినిమాలకు ఢోకా లేదు అనుకున్న టైమ్ లో.. కృతి శెట్టికి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలింది.

krithi Shetty
krithi Shetty

వారియర్‌ సినిమా వరకు కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న కృతి ఇప్పుడు వెనక్కు తగ్గారు. కోటి లోపే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆమె కెరీర్‌ ఇలా అవ్వటానికి కారణం ఏంటన్న దానిపై సినిమా సర్కిల్‌లో ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. కృతి శెట్టి తన తల్లి కారణంగానే సినిమాల విషయంలో వెనక్కు పడుతోందన్న టాక్‌ వినిపిస్తోంది. కృతి శెట్టి సినిమా కథల ఎంపిక విషయంలో ఆమె తల్లి నీతి శెట్టి కలుగజేసుకుంటున్నారట. ఎవరైనా కృతి శెట్టికి కథ చెప్పటానికి వెళ్లినపుడు.. కృతితో పాటు ఆమె తల్లి కూడా వింటున్నారట. ఆమెకు కూడా కథ నచ్చితేనే సినిమా చేయటానికి ఒప్పుకుంటున్నారట. లేదంటే వద్దని అంటున్నారట. ఇలా నీతి.. కృతి శెట్టి దగ్గరకు వచ్చిన చాలా సినిమాలను రిజెక్ట్‌ చేశారట. అలా ఆమె రిజెక్ట్‌ చేసిన సినిమాల్లో హిట్‌ సినిమాలు కూడా ఉన్నాయట.

Actress krithi Shetty
Actress krithi Shetty

వరుస ఫ్లాపులు పడినప్పుడు అవకాశాలు తగ్గడం .. మంచి ప్రాజెక్టు అయితేనే చేద్దాంలే అనుకుని దూకుడు తగ్గించడం సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఇలాంటి టైమ్ లో ఆమె కెరీర్ ను లైట్ తీసుకుంటే ఇక కృతి శెట్టిని మరిచిపోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. అంతే కాదు సినిమాలు లేకపోతే హీరోలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ.. జనాలు మర్చిపోకుండా చేస్తుంటారు. కాని కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేదు. సినిమాకోసం ఎంత బోల్డ్ గా నటించడానికి అయినా సై అన్న బ్యూటీ. సోషల్ మీడియాలో మాత్రం కాస్త పద్దతిగానే ఉంటోంది. గతంలో మాదిరిగా కృతి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. రాబోయే సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వెళ్తుననట్టు కూడా కనిపించడంలేదు. దాంతో కృతి శెట్టి జోరు తగ్గినట్టే అంటున్నారు సినిమా పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here