Honey Rose : ఐపీఎల్ 2024 తుది దశకు చేరుకుంది. ఈ పొట్టి క్రికెట్ ఫీవర్ సామాన్య ప్రేక్షకులనే కాదు సినీ సెలబ్రిటీలను సైతం ఓ రేంజ్ లో ఊపేస్తోంది. సినిమా సెలబ్రిటీలు తమకు నచ్చిన టీంలకు సపోర్ట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఎప్పటి నుంచో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు సపోర్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక మెజార్టీ సెలబ్రిటీలు ధోని ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ టీంకు సపోర్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు నచ్చిన టీం కనుక గెలిస్తే.. తాను బికినీ ధరించిన ఫోటోలను షేర్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బ్యూటీ హనీ రోజ్. ఈ మళయాళీ ఐపీఎల్లో ఆర్సీబీ టీంకు మద్దతు ప్రకటించింది.

ఐపీఎస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ టీంకు మద్దతుగా పోస్టులు పెడుతూ వస్తోంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. ఆర్సీబీ టీం గనుక గెలిస్తే..తాను బికినితో దర్శనం ఇస్తానంటూ బంపర్ ఆఫరిచ్చింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.. ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. ఆర్సీబీ కోసం కాకపోయిన హానీరోజ్ బికిని కోసమైన మ్యాచ్ గెలవాలంటూ నూటొక్క దేవుళ్లను ప్రార్థించారు. అయితే బుధవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘోరంగా ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన కీలక మ్యాచ్లో ఆర్సీబీ చేతులేత్తేసింది. దీంతో కప్ కొట్టాలనే కల తీరకుండానే టోర్నీ నుంచి నిరాశగా ఇంటి ముఖం పట్టింది. ఆర్సీబీ ఓడిపోవడంతో హానీరోజ్ బికినిపై ఆశలు పెట్టుకున్న ఆమె ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అయితే ఆర్సీబీ దాదాపుగా మ్యాచ్ చేజార్చుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు హానీరోజ్ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అన్ని తెలిసి తెగించేసిందని నెట్టింట్లో పలు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇక హానీరోజ్ కెరీర్ విషయానికి వస్తే శివాజీ సరసన ఆలయం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం హానీరోజ్ చేతిలో తెలుగు సినిమా ఒక్కటి లేకపోయినప్పటికీ… షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ చేతినిండా సంపాదిస్తుంది.