Actress Gopika : అసలు అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా కేవలం నటనతో మాత్రమే ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చిన హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.హీరోయిన్స్ కి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు రాసే డైరెక్టర్స్ ఉన్నంత కాలం ఇలాంటి సంసారపక్షంగా ఉండే హీరోయిన్స్ టైం ఒక రేంజ్ లో నడించింది.అలాంటి హీరోయిన్స్ లో ఒకరే గోపిక.మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ కేరళ కుట్టి 2002 వ సంవత్సరం లో ‘ప్రణయమనితోవేల్’ అనే మలయాళం సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.తొలి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా నటన పరంగా అందరినీ మెప్పించింది గోపిక.ఆ తర్వాత ఆమెకి వరుసగా సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా మూడవ సినిమా ‘4 ది పీపుల్’ అనే చిత్రం తో హీరోయిన్ గా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.

ఆ తర్వాత మలయాళం లో ‘ఆటోగ్రాఫ్’ అనే చిత్రం చేసింది.ఇది కూడా పెద్ద హిట్, ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.మలయాళం తో పాటుగా తెలుగు , తమిళ్ లో కూడా వరుసగా అవకాశాలను సంపాదిస్తూ అనతి కాలం మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఎదిగింది.తాను హీరోయిన్ గా నటించిన ‘ఆటోగ్రాఫ్’ సినిమానే తెలుగులో రవితేజ ని హీరోగా పెట్టి ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ పేరుతో రీమేక్ చేసారు.ఈ చిత్రం తెలుగు లో విమర్శకుల ప్రశంసలను అందుకుంది కానీ, కాసులు రాల్చలేదు.కానీ హీరోయిన్ గా చేసిన గోపిక కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత తెలుగు లో ఈమె ‘లేత మనసులు‘ , ‘యువసేన’, ‘ముద్దుల కొడుకు’, ‘వీధి’ మరియు ‘వీడు మామూలోడు కాదు’ వంటి సినిమాల్లో నటించింది.కమర్షియల్ గా తెలుగు లో ఒక్క సక్సెస్ లేకపోయినప్పటికీ గోపిక అంటే తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పడుతారు.అంత చక్కటి పాత్రలు పోషించింది ఈమె.కానీ మలయాళం లో మాత్రం మంచి సక్సెస్ రేట్ ఉంది, సినిమాల్లో మంచి రేంజ్ లో ఉన్న సమయం లోనే 2008 వ సంవత్సరం లో అజిలేష్ చాకో అనే డాక్టర్ ని పెళ్ళాడి ఐర్లాండ్ లో స్థిరపడిపోయింది.ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు మరియు కూతురు ఉన్నారు.ఆ తర్వాత కొన్నేళ్ళకు గోపిక కుటుంబం మొత్తం ఐర్లాండ్ నుండి ఆస్ట్రేలియా కి షిఫ్ట్ అయ్యి అక్కడే స్థిరపడిపోయింది.



