పెళ్లయిన ప్రతి మహిళ గర్భం దాల్చాలని కోరుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యకాకపోతే చిత్రవధ అనుభవిస్తూ ఉంటారు. ఇక బంధువులు, సన్నిహితుల మాటలు పడలేక సతమతమవుతుంటారు. ఇప్పుడు కృత్రిమ గర్భదారణ పద్ధతులు అమ్మకాలేమన్న లోటును తీరుస్తున్నాయి. అయితే తల్లి కాలేదన్న బాధ తాను కూడా అనుభవించినట్లు ప్రముఖ బుల్లితెర నటి దెబీనా బొనర్జీ చెప్పుకొచ్చారు.
దెబీనా బొనర్జీ గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఐవీఎఫ్ విధానాన్ని( IVF ) ఎంచుకుని తల్లైన ఈ మహిళ తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను కొన్నాళ్ల పాటు పిల్లల కోసం పరితపించానని దెబీనా బొనర్జీ చెప్పారు. వైద్యులను కలవగా వాళ్లు మొదట ఐయూఐ విధానాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారని ఇది హానికర ప్రక్రియ కాకపోవడంతో వెంటనే ఆ ప్రక్రియకు అంగీకరించానని తెలిపారు. అయితే ఈ విధానం తనకు పని చేయలేదని చెప్పారు.
ఐదుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎంతో నిరాశకు గుర్యయానని తెలిపారు. ఈ పద్ధతి ఫలించక పోవటంతో ఆ తర్వాత ఐవీఎఫ్ విధానాన్ని ఎంచుకున్నానని నటి పేర్కొన్నారు.ఈ విధానంలో పిండాన్ని కడుపులో ప్రవేశపెట్టడానికి 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తారని ఆమె తెలిపారు. ఆస్పత్రిని బట్టి ధరలో మార్పులు ఉంటాయని ఐవీఎఫ్ ఎందుకని చాలామంది అడిగారని నటి పేర్కొన్నారు. బాధపడటం కంటే ప్రయత్నించడం మంచిది కదా అని ఆమె అన్నారు.
ఐదు సంవత్సరాల పాటు ప్రయత్నించిన తర్వాత పాప పుట్టిందని దెబీనా పేర్కొన్నారు. తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ నటి తర్వాత రోజుల్లో బుల్లితెరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి అక్కడ మెప్పించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ నటి తన భర్తతో మూడుసార్లు పెళ్లి చేసుకోవడం గమనార్హం. అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో తెలుగులో ఈ నటి సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా అవి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి.