Anupama : తనతో వున్న ఫోటో షేర్‌ చేసిన టిల్లు లిల్లీ.. ఓ దట్టా.. ఐథింగ్‌ వాటో వాటు..!

- Advertisement -

Anupama : పక్కింటి అమ్మాయిలానే ఈ కేరళ క్యూటీ తెలుగు జనాలతో కలిసిపోయింది. ‘ప్రేమమ్’ సినిమాతో వెండితో పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి అందరినీ ఆకట్టుకుంది. అనుపమ తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టింది. కార్తికేయ-2 సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ భామ తాజాగా టిల్ స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా చూసిన వాళ్లంతా లిల్లీ బేబీ దుమ్మురేపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాలో అమ్మడు అందాల ఆరబోసిందని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. టిల్లుతో లిల్లీ సూపర్ అంటూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఒక ఫోటోను షేర్ చేసి అందులో ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎవరా అని తెలుసుకునేందుకు నెటిజన్లు బిజీ అయ్యారు. అయితే ఆమె ఎవరో తెలిసాక.. ఓ దట్టా.. ఐథింగ్‌ వాటో వాటు.. అంటూ కామెడీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే అనుపమ షేర్‌ చేసిన ఫోటో ఎవరిది అంటే…?

- Advertisement -

ఇదిలా ఉంటే అనుపమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మడికి సంబంధించిన ఏ పోస్ట్ చేసినా యూత్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుంటారు. అలాగే తాజాగా ఈ బ్యూటీ తన తమ్ముడిని కౌగిలించుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఇటీవల, ఆమె తన తల్లి సునీతతో కలిసి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఫోటోలను షేర్ చేసింది. అనుపమ ఫోటోలపై క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. అమ్మా.. నీ కూతురిని చూసుకో అంటూ కొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లలా కనిపిస్తున్నారని చెప్పారు. తన బలాన్ని అమ్ముకుంటానని అనుపమ సునీతను అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంది. కొన్నిసార్లు ఆమె తన తల్లి గురించి చాలా కార్టూన్లతో పోస్ట్ చేసి అందరినీ నవ్విస్తుంది. టిల్లూ స్క్వేర్ హిట్‌ని ఎంజాయ్ చేస్తున్న అనుపమ ఈరోజు అమ్మ పుట్టిన రోజు కావడంతో ఆనందం రెట్టింపు అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here