Anupama Parameswaran : టిల్లు స్క్వేర్ సినిమా పై నటి అనుపమ పరమేశ్వరన్ సెన్సేషనల్ కామెంట్స్..!

- Advertisement -

Anupama Parameswaran : నటి అనుపమ పరమేశ్వరన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అనుపమ పరమేశ్వరన్ ఎప్పటి నుండో సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసి తాను ఏంటో ప్రూవ్ చేసుకుంది. తన టాలెంట్ తో నటనతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ పంచుకుంటూ ఉంటుంది. ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా తన తాజా అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

anupama parameshwaran
anupama parameshwaran

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ లో నటించింది అయితే ఇప్పటి వరకు ఎవరు చూడని అనుపమని ఈ సినిమాలో చూపించారు. ఇటువంటి సినిమా చేయడంపై అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఎందుకు ఇలాంటి పాత్రలు ఒప్పుకుంది అనే ప్రశ్నకి సమాధానం ఏం చెప్పిందో తెలుసా..? అనుపమ పరమేశ్వరన్ ఎందుకు ఇలాంటి పాత్రలు చేసింది అని అడగగా.. అందుకు అనుపమ పరమేశ్వరన్ పెద్ద కౌంటర్ ఏ ఇచ్చింది. మాములుగా లిమిట్ పెట్టుకుంటాము.

కంఫర్ట్ గా వుండే బట్టలని మనం వేసుకుంటాము. కానీ ఒక్కోసారి కొత్తవి వేసుకోవాలని మనం అనుకుంటాము. కొత్తవి కూడా వేసుకోవాలి కదా అని అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ గురించి చెప్పారు. అలానే బిర్యాని ఇష్టం అని మనం రోజూ తినము కదా అన్నీ తింటాము. అంతే కానీ రోజూ మనం బిర్యాని ఇష్టం అని తినము కదా అని అన్నారు. అలానే టిల్లు స్క్వేర్ ని వదులుకోవడం కంటే స్టుపిడిటీ ఏమీ లేదు అని అన్నారు అనుపమ. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా అందరినీ అలరిస్తుందని అని డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here