Vijay Devarakonda : ఆ దర్శకుడి చేతిలో మోసపోయిన విజయ్ దేవరకొండ..

- Advertisement -

Vijay Devarakonda : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ కి దూసుకొచ్చిన నటుడు విజయ్ దేవరకొండ. న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమా ద్వారా ఒక సపోర్టింగ్ రోల్ తో ఇండస్ట్రీ కి పరిచయమైనా విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ రేంజ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. లైగర్ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెయ్యగా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో విజయ్ దేవరకొండ కాస్త డీలా పడ్డాడు.

Vijay Devarakonda
Vijay Devarakonda

ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ అనే దర్శకుడితో ఖుషి మరియు జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో మరో సినిమా చెయ్యబోతున్నాడు.అయితే అప్పట్లో విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని ట్విటర్ లో అధికారికంగా తెలియచేసాడు. కానీ పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత సుకుమార్ వెంటనే సీక్వెల్ కి ప్లాన్ చెయ్యడం వంటివి అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా పూర్తి అవ్వగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట సుకుమార్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పది నిమిషాల సన్నివేశాన్ని తెరకెక్కించేసాడట.

ఇలా మా హీరో కి కమిట్మెంట్ ఇచ్చి వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నావ్. అంటే మా హీరో సినిమాని పక్కన పెట్టేసినట్టేనా, మా హీరో ని మోసం చేసినట్టేనా అని ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ ని గమనించిన ఫాలకున్ క్రియేషన్స్ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదని, సుకుమార్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ వెంటనే ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. దీనితో సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి వస్తున్న రూమర్స్ అన్నిటికీ చెక్ పడింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here