నేచురల్ నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ రాజా. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఈయన చాలా సినిమాలే చేశారు. బుల్లితెరపై పలు సీరియళ్లలో కూడా నటించారు. శివాజీ రాజా చిరంజీవికి వీరాభిమాని అని అంటారు. కానీ ప్రస్తుతం ఆయన చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యాలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ పిలిచి తన సినిమాలో అవకాశం ఇచ్చినా ఆయనతో నటించని శివాజీ అనడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. అడపా తడపా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న శివాజీ రాజా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన కెరియర్ పట్ల సంతృప్తికరంగా ఉన్నానని చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి గురించి హాట్ కామెంట్స్ చేశారు. నేను చిరంజీవికి వీరాభిమానిని అని అందరికీ తెలుసు. ఆయన కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడిని. కానీ మన వాడే కదా అని ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదు. చిరంజీవితో గానీ, ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలతో గానీ ఓ సినిమా కూడా చేయలేదు. చిరంజీవి అభిమానిగా ఇన్ని ఏళ్లు ఉన్నందుకు కనీసం ఆయన సినిమాల్లో నటిస్తే నాకు సంతృప్తి ఉండేది. కానీ ఇకపై నాలో ఆ తపన లేదు.. నా మనసులో చిరంజీవితో నటించాలన్న కోరిక చచ్చిపోయింది..ఇక ఆయనే పిలిచి అవకాశం ఇచ్చినా కూడా నేను ఆయనతో నటించే ప్రసక్తే లేదంటూ శివాజీ రాజా వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మరి శివాజీ కామెంట్లకు మెగాస్టార్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
