Actor Rana : హీరో రానా రెండు కిడ్నీలు చెడిపోయాయా.. అయ్యో పాపం.. ఫుల్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

- Advertisement -

Actor Rana : మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించిన అతి తక్కవ మంది హీరోలలో ఒక్కడు రానా దగ్గుపాటి.బాహుబలి సిరీస్ తో ఈయన మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.అంతే కాదు బాలీవుడ్ లో ఆయన పలు సినిమాల్లో హీరో గా చేసి హిట్టు కొట్టి ఉన్నాడు.అందులో ‘ఘాజి’ అనే చిత్రం కూడా ఉంది,కేవలం హీరో రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా,నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ ముందుకెళ్తున్నాడు.

Actor Rana
Actor Rana

అందుకే రానా ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో ఎంతో స్పెషల్.అయితే రీసెంట్ గా ఆయన తన బాబాయి విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేసాడు.హిందీ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో నిండిపోయిన ఈ వెబ్ సిరీస్ పై నెటిజెన్స్ నుండి తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ మంచి వ్యూస్ ని అయితే సంపాదించుకుంది.

Rana
Rana

అయితే ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా రానా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టాడు.’బాహుబలి తర్వాత నా కెరీర్ ఎక్కడో ఉండాలి, మంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి, అవన్నీ ఒప్పుకొని చేసి ఉంటే ఈరోజు నేను కూడా ఒక స్టార్ గా ఉండేవాడిని ఏమో.నాకు ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను.కన్ను మరియు కిడ్నీ కి ఆపరేషన్ జరిగింది.నా రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి, రెండిటిని మార్చాల్సి వచ్చింది.ఆ సమయం లో నేను మానసికంగా ఎంతో సంఘర్షణ ని ఎదురుకున్నాను,మొత్తానికి జయించాను’ అంటూ చెప్పుకొచ్చాడు.ఆయనకీ ఆరోగ్యం సంపూర్ణంగా కుదుట పడిన తర్వాతనే సినిమాలను ఒప్పుకోవడం, అలాగే మిహికా బజాజ్ ని వెళ్లడం వంటివి జరిగాయి.ఇప్పటి నుండి రానా కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here