Sowmya Rao : లైవ్ లో కృష్ణ భగవాన్ కు ముద్దు పెట్టేసిన యాంకర్.. కృష్ణ భగవాన్ రియాక్షన్ ఏంటో తెలుసా?

- Advertisement -

Sowmya Rao : జబర్దస్త్ షో ఒకప్పుడు కామెడికి కేరాఫ్ ఉంది.. రాను రాను ఈ షో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగారపు సన్నివేశాలను చూపిస్తూ కమెడీయన్లు రెచ్చిపోతున్నారు.. దీంతో షో పై ఎన్ని విమర్శలు వచ్చిన కూడా జబర్దస్త్ టీమ్ అదే ఫాలో అవుతుంది.. ఇక ఈ మధ్య షోకు యాంకర్స్ మారిన సంగతి తెలిసిందే.. అనసూయ ప్లేసులో సౌమ్య రావు వచ్చింది.. మొదట విమర్శలు వెలువెత్తిన కూడా ఇప్పుడు అమ్మాయి కూడా పంచులు వేస్తూ షోను రక్తికట్టిస్తున్నారు.. అయితే తాజాగా యాంకర్‌ సౌమ్య రావు, కృష్ణ భగవాన్‌ ల మధ్య చోటుచేసుకున్న కిస్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ఇంద్రజ ఆమెని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా షాకిచ్చిందీ కొత్త యాంకర్‌.. అందుకు సంబందించిన వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Sowmya Rao
Sowmya Rao

జబర్దస్త్` కామెడీ షోకి గతంతో పోల్చితే క్రేజ్‌ తగ్గుతుందనే కామెంట్లు తరచూ వ్యక్తమవుతున్నాయి. కానీ అడపాదడపా ఆ రేటింగ్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణభగవాన్‌, సౌమ్య రావు. పంచ్‌లతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జడ్జ్ కి యాంకర్‌ ముద్దు పెట్టడం హైలైట్‌గా మారింది. ఆవేశంలో యాంకర్‌ సౌమ్య రావు చేసిన పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. షోలో ఉన్న వారంతా గోల పెడుతున్నారు. తాజాగా మార్చి 23 తేదీ ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు..ఆ ఎపిసోడ్ లో యాంకర్ సౌమ్య నూకరాజు లాగా చేసింది..అంతా ఆమె కృష్ణభగవాన్‌కి బుగ్గకి ముద్దు పెడుతుందనుకున్నారు. కానీ ఆమె ఆయన చేయిని తీసుకుని వేళ్లకి ముద్దు పెట్టింది. దీంతో అంతా షాక్‌ అయ్యారు.

Jabardasth anchor Sowmya Rao

సౌమ్య రావు ఇంతటి సాహసం చేస్తుందా అని ఆశ్చర్యపోయారు. మొత్తం అందరు హో ఏసుకున్నారు. ఇదే హైలైట్‌ అంటే దాన్ని మించి మరో చిలిపి పని చేశాడు కృష్ణ భగవాన్‌. ఇలాంటి సందర్భాల్లో రెచ్చిపోయి కామెడీ చేసే ఆయన సౌమ్య రావు ముద్దు పెట్టిన తన చేతి వేళ్లకి అదే ప్లేస్‌లో తను ముద్దు పెట్టుకోవడం విశేషం.. మొత్తానికి ప్రోమో ఇప్పుడు హైలెట్ అవ్వగా ఇక ఎపిసోడ్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ప్రోమో పై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here