ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయిన జంట నరేష్ – పవిత్ర, ముదురు వయస్సు లో పెళ్ళికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని పెళ్లి చేసుకున్న ఈ జంటపై సోషల్ మీడియా లో ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా నరేష్ ఓవర్ యాక్షన్ కి నెటిజెన్స్ ఇచ్చే రియాక్షన్స్ మామూలుగా ఉండదు.
పబ్లిక్ గా లిప్ కిస్ ఇస్తూ , ఆ వీడియో ని న్యూ ఇయర్ రోజు ట్విట్టర్ లో అప్లోడ్ చెయ్యడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆయన కొద్దిరోజులకు పెళ్లి కూడా చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి తమ ప్రేమ వ్యవహారం పై ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తీశారు.ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు.
ఈ ట్రైలర్ కి ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసారు, ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఒక విలేఖరి నరేష్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ పెళ్లి నిజంగానే జరిగిందా, లేదా ఇది కూడా మూవీ ప్రొమోషన్స్ లో భాగమా’ అని అడుగుతాడు.
అప్పుడు నరేష్ దానికి సమాధానం చెప్తూ ‘నాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారేజ్ మీద చాలా గౌరవం ఉంది.ఈరోజు అది కుప్పకూలిపోతుంది, ఇప్పుడు మన వ్యవస్థ లో ఇన్ని ఫ్యామిలీ కోర్టులు ఎందుకు ఉన్నాయి,ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది కాబట్టే కదా. కానీ మళ్లీ పెళ్లి సినిమా ఆ వ్యవస్థ ని గౌరవిస్తు చేసిన సినిమా, పెళ్లి అంటే రెండు మనసులు కలయిక అని చెప్పడమే ఈ సినెమా ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం’ అని అంటాడు, అప్పుడు విలేకరి మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అని మరోసారి అడగగా ‘మనసులు కలవడం అంటే ఏమిటి, పెళ్లి చేసుకున్నట్టే కదా’ అని బదులిస్తాడు నరేష్. ఇలా స్పష్టత లేకుండా మాట్లాడి ఫ్యాన్స్ లో గందరగోళం క్రియేట్ చేసాడు నరేష్.