అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య లవ్ స్టోరీ నడుస్తోందని గత మూడేళ్లుగా రకరకాల వార్తలు వినిపించాయి. వార్తలను ఎట్టకేలకు నిజం చేస్తూ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకుని ఈ ఏడాది ఒక్కటి కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన వీరి ఎంగేజ్‌మెంట్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది.

భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఏడేళ్లుగా డేటింగ్ చేశారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ కాకుండా గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఓ హీరో విషయంలో పెద్ద గొడవే జరిగిందంట. విజయ్ దేవరకొండ నటించనున్న మూవీలో దర్శకుడు పరుశురామ్ రష్మిక కాకుండా లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని భావిచాడట.. అయితే కథ బాగున్నా విజయ్ దేవరకొండ అంటే లిప్ లాక్ లు ఖచ్చితంగా ఉన్నాయని, వరుణ్ తేజ్ లావణ్యను నువ్వు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాడట.
నిజానికి ఇందులో ఒకే ఒక్క లిప్ లాక్ సీన్ ఉండడంతో ఈ సినిమా తన కేరీర్ కు బాగా ఉపయోగపడుతుందని లావణ్య చెప్పినా వరుణ్ ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగినా చివరికి వరుణ్ తేజ్ మాటలు విని లావణ్య త్రిపాఠి సినిమా నుంచి తప్పుకుందట. విజయ్ కారణంగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ స్టార్ పొజిషన్లలో ఉన్నారని, లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో నటించి ఉంటే ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయ్యేదని ఆమె అభిమానులు అంటున్నారు.