Rakhi Sawant : బాలీవుడ్ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీసావంత్ వివాహం రోజుకో మలుపు తిరుగుతోంది.. కొన్ని రోజుల క్రితం రాఖీసావంత్ తన భర్త ఆదిల్ దురానితో ఎలాంటి గొడవలు లేవని ప్రకటించిన సంగతి తెలిసిందే.. దాంతో వీరిద్దరికి సఖ్యత కుదిరిందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది..
తన భర్త తనని వేధిస్తున్నాడని తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ఆదిల్ దురానిపై ఆరోపణలు చేసింది.. ఆదిల్ గురించి మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది రాఖీసావంత్.. తాజాగా రాఖీసావంత్ ఇప్పటివరకు ఏదైతే కష్టాలను అనుభవించిందో వాటిని వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దాంతో ఆమెకు చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు.
తన భర్తకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని వేరే వాళ్ళతో బెడ్ షేర్ చేసుకున్నాడని అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టింది. కెమెరా ముందుకు వచ్చి మంచిగా కనిపించే తన భర్త ఓ రాక్షసుడు అని.. మీడియా ముందుకు వచ్చి తన గురించి ఎప్పుడూ మంచి మాటలే చెప్పాలని లేదంటే.. తనను చంపుతానని బెదిరించాడని రాఖి అసలు విషయం బయట పెట్టింది. పోలీసులకు ఆదిల్ పై ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది.
ఆదిల్ నన్ను చిత్రహింసలు పెట్టేవాడు రకరకాలుగా వేధించేవాడు.. తనని హీరో చేయమని చాలాసార్లు నాపై చేయి చేసుకున్నాడు. కనుక పెద్ద వ్యాపారవేత్తని కారుతో పాటు బంగ్లా గిఫ్ట్ గా ఇచ్చానని మీడియా ముందు గొప్పలు చెప్పమని బెదిరించేవాడు. నేను చెప్పకపోతే నన్ను పెళ్లి చేసుకోనని నన్ను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. అంతేకాకుండా వేరే అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకొని ఆ వీడియోలను కూడా నాకు పంపుతానని బెదిరించేవాడు..
తనకి వ్యతిరేకంగా నేను ఏదైనా చేస్తే సుపారీ ఇచ్చి నన్ను ట్రక్కుతో చంపేయడానికి కూడా సిద్ధమైనట్లు నాతో చాలా సార్లు చెప్పాడని ఆమె వివరించింది .. ఆదిల్ కు ఇదివరకే పెళ్లి, విడాకులు అయ్యాయి. అయితే ఈ విషయాన్ని నా దగ్గర దాచి పెట్టి నన్ను మోసం చేశాడు. అతనికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి. ఓవైపు అమ్మ చనిపోగా.. మరోవైపు భర్త మోసం చేశాడు .. ఇప్పుడు నేను జీవచ్ఛవంలా బ్రతికున్న అంటూ.. రాఖీసావంత్ ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధ తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అండగా నిలుస్తున్నారు.. మనిషిని మీ జీవితంలో కూడా దగ్గరకు రానివ్వద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు..
తన భర్త తో గొడవలు జరుగుతున్నప్పుడు షెర్లిన్ చోప్రా నుండి తనకు మద్దతు లభించిందని ఆమె తెలిపింది. పాపరాజో వీడియోలో షెర్లిన్ నుంచి తనకు హిమ్మత్ వచ్చిందని రాఖి చెప్పింది. ఇలాంటి కష్ట కాలంలో తనకి అండగా నిలిచినందుకు రాఖీ సావంత్ ఓ వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది దాంతో ఫాన్స్ కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు నీకు మేమున్నాం అంటూ ధైర్యాన్ని అందిస్తున్నారు లాంటి నీచులకు తగిన గుణపాఠం చెప్పావు ఇకనుంచి నీ జీవితం అంతా మంచిగా ఉండాలని అందుకు మా అందరి సపోర్ట్ నీకు ఉంటుందంటూ నేటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.