Punarnavi Bhupalam : బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిగ్ బాస్ కి రాకముందు కొన్ని సినిమాల్లో నటించిన అంత ఫేమ్ రాలేదు.. కానీ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని యూత్ క్రష్ గా నిలిచింది ఈ అమ్మడు.. పునర్నవి భూపాలం ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. దానిపై పునర్నవి క్లారిటీ ఇచ్చింది..
తెలుగు బిగ్ బాస్ షోలో లవ్ ఎఫైర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది పునర్నవి రాహుల్ సిప్లిగంజ్.. అంతకు ముందు రెండు సీజన్లలో లవర్స్ గా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. రాహుల్ పునర్నవి లవ్ ట్రాక్ అద్భుతంగా సక్సెస్ అయింది. బిగ్ బాస్ షో కి ఊహించిన టిఆర్పిని అందించింది మాత్రం వీళ్ళ లవ్ ట్రాక్ అనే చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 రాహుల్ విన్నర్ కావడం విశేషం. పునర్నవి మాత్రం ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది..
కొన్నాళ్లు బిగ్ బాస్ హౌస్ లో మొదలైన వీరి స్నేహాన్ని ఈ జంట బయట కూడా కొనసాగించారు. పలు షోలలో కూడా వీళ్ళ లవ్ ట్రాక్ ఉపయోగించి స్పెషల్ షోలు కూడా చేసి హైలెట్ చేశారు. ఆ తర్వాత ఎవరిదారులు వారివి అయ్యాయి.. జనాలు కూడా ఈ జంట గురించి మర్చిపోయారు. పునర్నవి యాక్టింగ్ కి బ్రేక్ తీసుకుంది. పై చదువుల కోసం లండన్ వెళ్లిన పునర్నవి ప్రస్తుతం అక్కడే ఉంటుంది..
తరచూ అక్కడ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంది తన ఫాన్స్ తో .. అయితే పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్పడంతో అదే నిజమని కొందరు అనుకున్నారు.. ఇక ఆ వీడియోలు పునర్నవి దృష్టికి వెళ్లడంతో తను ఫైర్ అయ్యారు.. పునర్నవి ఇన్స్టాగ్రామ్ ద్వారా కదా క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ పునర్నవి తన పొట్ట చూపిస్తూ ఒక ఫోటోలు షేర్ చేస్తూ.. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక గే.. అతనితో నేను గర్భవతిని అయ్యానా.. యూట్యూబ్ ఛానల్స్ నేను ప్రెగ్నెంట్ అయ్యనని రూమర్స్ క్రియేట్ చేశారు. ఇదంతా నాన్సెన్స్.. ఒకప్పుడు నాకు హెల్త్ బాగా ఒక సిక్ అయితే నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ప్రచారం చేశారు. టాలీవుడ్ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటుంటే.. కొంతమంది మాత్రం ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసుకుంటూ బ్రతికేస్తున్నారని పునర్నవి భూపాలం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పునర్నవి భూపాలం గురించి ఇలాంటి వార్తలు మరోసారి పునరావృతం కాకుండా ఉంటే చాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.