Chiranjeevi – Balakrishna : ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలు నోరు జారి వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు.. పబ్లిక్ లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.. ట్రోల్స్ గురవుతూ వార్తల్లో నిలుస్తున్నారు.. మొన్నీమధ్య బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య చేసిన అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలు ఎన్ని విమర్శలకు దారితీశాయో తెలిసిందే..
అదే విధంగా చిరు కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో రవితేజ పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు అందుకున్నారు.. వీటి గురించి జనాలు పూర్తిగా మర్చిపోక ముందే బాలయ్య మరోసారి పాన్ ఇండియా సినిమాలపై కామెంట్లు చేశారు.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి..
బాహుబలి, కేజీఎఫ్, త్రిపుల్ ఆర్ సినిమాలతో ఇండస్ట్రీ ఇండస్ట్రీకి మధ్య కంచెలు తొలిగిపోయాయి. ఇప్పుడు సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం విడుదలైన ప్రతి సినిమా పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటే అది పాన్ ఇండియా సినిమానే. అలా వచ్చినవే కాంతార, కార్తికేయ-2 చిత్రాలు. సొంత గడ్డ పై సూపర్ సక్సెస్ ని అందుకుంటే చాలు ఆ సినిమాని ఇతర భాషల్లో కూడా డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేస్తున్నారు మేకర్స్. తాజాగా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న చిత్రం.. ఇతర భాషల్లో రిలీజ్ కి సిద్దమవుతుంది..
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన చిత్రం ‘వేద’. గత ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా శివరాజ్ కుమార్ 125వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడనాట బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ నెల 10వ తారీఖున తెలుగులో విడుదల చేస్తున్నారు.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాదాపూర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాలయ్య హాజరయ్యాడు. కంటెంట్ ఉన్న ప్రతి సినిమా నేడు పాన్ ఇండియా మూవీనే. అలాంటి ఒక మంచి సినిమా తెరకెక్కాలి అంటే హీరో, దర్శకుడు, నిర్మాత మధ్య ఒక మంచి సంబంధం ఉండాలి. అప్పుడే ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటారు. అలా కాకుండా నేను చెప్పిందే కథ, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటే మంచి సినిమాలు రావు.
నా వీరసింహారెడ్డి సినిమాలో పెద్ద బాలకృష్ణ గెటప్ కి.. శివరాజ్ మఫ్టీ మూవీలోని గెటప్ అయితే బాగుంటుందని దర్శకుడికి సలహా ఇచ్చా.. అది హిట్ అయ్యిందని అన్నారు.. అలాగే చిరంజీవి కూడా డైరెక్టర్ లకు షాక్ ఇచ్చాడు.. డైరెక్టర్లను ఇలా అనడం తో చర్చనీయాంశంగా మారింది..