VeerWaltair Veerayya : ఈ సంక్రాంతి టాలీవుడ్ కి మరోసారి గోల్డెన్ పీరియడ్ ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి.. చరిత్రలో ఎవ్వరు చేయనటువంటి సాహసం ‘మైత్రి మూవీ మేకర్స్’ చేసి టాలీవుడ్ కి కాసుల గలగల చూపించారు. ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘Waltair Veerayya’ మరియు నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు కేవలం ఒక్క రోజు తేడా తో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచి, బయ్యర్స్ కి భారీ లాభాల్ని తెచ్చిపెట్టాయి.
‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుండగా, ‘వీర సింహా రెడ్డి’ చిత్రం 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..’వాల్తేరు వీరయ్య’ సినిమాకి సుమారుగా 50 కోట్ల రూపాయిలు లాభాలు రాగ, వీర సింహ రెడ్డి చిత్రానికి 5 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.
థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్న ఈ రెండు సినిమాల OTT విడుదల తేదీలు వచ్చేసాయి.’వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్స్ తో కొనుగోలు చెయ్యగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు అధికారికంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది..ఇక ‘వీర సింహా రెడ్డి’ చిత్రం డిజిటల్ మీడియా రైట్స్ డిస్నీ + హాట్ స్టార్ తో ఉన్నాయి.
ఈ సినిమా ఫిబ్రవరి 21 వ తారీఖున టెలికాస్ట్ చెయ్యబోతున్నట్టు సమాచారం, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. థియేటర్స్ లో వీర సింహా రెడ్డి చిత్రం పై భారీ మార్జిన్ తో గెలుపొంది సంక్రాంతి విజేతగా జెండా ఎగురవేసిన ‘ వాల్తేరు వీరయ్య ‘ చిత్రం, ఓటీటీ లో కూడా అదే రేంజ్ ఆధిపత్యం చూపిస్తుందా?, లేదా ‘ వీర సింహా రెడ్డి ‘ కి ఎక్కువ ఆదరణ దక్కుతుందా అనేది చోడాలి.
‘వాల్తేరు వీరయ్య’ 24 రోజుల కలెక్షన్స్
నైజాం : రూ. 35.82 కోట్లు
సీడెడ్ : రూ. 18.09 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 19.06 కోట్లు
ఈస్ట్ గోదావరి : రూ. 12.90 కోట్లు
వెస్ట్ గోదావరి : రూ. 7.08 కోట్లు
గుంటూరు : రూ. 9.11 కోట్లు
కృష్ణ : రూ. 7.66 కోట్లు
నెల్లూరు : రూ. 4.57 కోట్లు
‘వీర సింహారెడ్డి’ 25రోజుల కలెక్షన్లు..
నైజాం : రూ. 17.31కోట్లు
సీడెడ్ : రూ. 16.50 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.8.55 కోట్లు
ఈస్ట్ గోదావరి : రూ.6.60 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ. 4.90 కోట్లు
గుంటూరు : రూ.7.42 కోట్లు
కృష్ణ : రూ. 4.73 కోట్లు
నెల్లూరు : రూ. 3.00 కోట్లు