Allu Aravind : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మూల స్థంబాలు లాంటి నిర్మాతలలో ఒకడు గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు.. దశాబ్దాల నుండి ఆయన ఇదే బ్రాండ్ ఇమేజి ని కొనసాగిస్తూనే ఉన్నాడు.. మన టాలీవుడ్ ని మగధీర సినిమాతో నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన మొట్టమొదటి నిర్మాత ఆయన.. అంతే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల సినిమా కూడా ఈయన ప్రొడక్షన్ నుండి వచ్చినదే.

ఎంత తెలివితేటలు ఉంది ఉంటే ఇన్ని దశాబ్దాలు అగ్ర నిర్మాతగా కొనసాగి ఉంటారు..?, అలాంటి నిర్మాతగా దగ్గర కుప్పిగంటలు వేస్తే చెల్లదుగా.. కానీ దిల్ రాజు కుప్పి గంతులు కాదు, ఏకంగా వెన్నుపోటు పొడవబోయాడు. విషయం ముందే పసిగట్టిన అల్లు అరవింద్, ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి దిల్ రాజు పరువు మొత్తం తియ్యడానికి సిద్ధం అయ్యాడు అని వార్త రాగానే దిల్ రాజు కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.

అసలు విషయానికి వస్తే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ప్రముఖ దర్శకుడు పరశురామ్ పెట్ల తో విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమా ఖరారు అయ్యింది.. గతం లో ఇదే కాంబినేషన్ లో గీత గోవిందం అనే సినిమా వచ్చింది.. ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే . మళ్ళీ వీరి కాంబినేషన్ క్రేజీ మూవీ ని ఎప్పుడో లాక్ చేసి అగ్రీమెంట్స్ కూడా చేయించుకున్నాడు అల్లు అరవింద్.. అంతా ఓకే అనుకుకొని సెట్స్ మీదకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్న సమయం లో దిల్ రాజు పరశురామ్ పెట్ల దగ్గర ఆ స్క్రిప్ట్ ని కొనుగోలు చేసి తన బ్యానర్ లో తియ్యడానికి సిద్ధం అయ్యాడు.

ఇది తెలుసుకున్న అల్లు అరవింద్ ఆవేశం తో ఊగిపోయి, ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసి ప్రెస్ మీట్ ద్వారా దిల్ రాజు ని ఏకిపారేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న దిల్ రాజు వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి తెలియక అలా జరిగిపోయింది క్షమించండి అని క్షమాపణలు కోరాడట.. అక్కడితో సమస్య పరిష్కారం అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్నదిల్ రాజు లాంటి నిర్మాత కూడా అల్లు అరవింద్ కి ఈ రేంజ్ లో భయపడ్డాడు అంటే ఆయన రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
