Sreeleela : గడిచిన కొద్దీ సంవత్సరాలలో టాలీవుడ్ కి వచ్చిన కొత్త హీరోయిన్స్ లో ఒకే ఒక్క సినిమాతో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీలీల అనే చెప్పాలి..దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణ సారథ్యంలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా శ్రీలీల కి ప్రస్తుతం టాలీవుడ్ లో మామూలు డిమాండ్ లేదు.
ఈమెకి ఉన్న క్రేజ్ దెబ్బకి ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన వాళ్ళందరి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది..కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికీ ఇప్పుడు శ్రీలీలనే కావలి..రీసెంట్ గా ధమాకా మూవీ తో సూపర్ హిట్ కొట్టిన శ్రీలీల కి మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
ఈ సినిమాతో పాటుగా పంజా వైష్ణవ్ తేజ్ , రామ్ పోతినేని , నవీన్ పోలిశెట్టి మరియు నితిన్ వంటి హీరోల సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది..అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.. అవన్నీ విన్న తర్వాత శ్రీలీల లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు.. ఇక అసలు విషయానికి వస్తే శ్రీలీల కి చాలా కోపమట.. తన లో ఒక అపరిచితుడు ఉంటాడని.
తనకి తెలియకుండానే అప్పుడప్పుడు విపరీతమైన కోపం వచేస్తాడని..ఆ కోపం లో ఇష్టమొచ్చినట్టు అవతలి వ్యక్తి మీద అరిచేస్తానని చెప్పుకొచ్చింది.. అలా నా కోపానికి మా అమ్మ ఎక్కువ బలైందని, ఆమె మీద లెక్కలేనన్నిసార్లు అరిచేదానిని అంటూ చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత కోపం చల్లారాక అమ్మని ఇలా అరిచేశానా అని తలచుకొని బాగా ఏడ్చేదట.. మా అమ్మ కాబట్టి నన్ను భరిస్తుంది కానీ, వేరేవాళ్లు అయితే ఎప్పుడో నన్ను వదిలేసి పారిపొయ్యేవాళ్ళు అని చెప్పుకొచ్చింది శ్రీలీల.