Naga Babu : నాగబాబు నుండి దూరం కాబోతున్న వరుణ్ తేజ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్

- Advertisement -

Naga Babu : మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రతీ హీరో మంచి సక్సెస్ ని సాధించాడు.. కానీ నాగబాబు మాత్రం ఆ రేంజ్ కి వెళ్లకపోయాడు.. కెరీర్ ప్రారంభం లో హీరో గా పలు సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ సాధించకపొయ్యేలోపు ఆయన హీరో రోల్స్ కి టాటా చెప్పేసి క్యారక్టర్ ఆర్టిస్టు గా స్థిరపడిపోయాడు.. అందులో కూడా మిగిలిన క్యారక్టర్ ఆర్టిస్టులతో పోలిస్తే నాగబాబు సాధించింది తక్కువే.. అంతే కాకుండా అంజనా ప్రొడక్షన్స్ పేరిట ఒక బ్యానర్ ని కూడా స్థాపించాడు.

Naga Babu
Naga Babu

ఈ బ్యానర్ మీద తెరకెక్కిన సినిమాల్లో కేవలం ‘బావగారూ బాగున్నారా’ మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.. కానీ మెగాస్టార్ చిరంజీవి తో తీసిన ‘రుద్రవీణ’ చిత్రానికి మాత్రం జాతీయ అవార్డు వచ్చింది.. ఇక మగధీర వంటి సంచలన విజయం తర్వాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో తీసిన ‘ఆరంజ్’ చిత్రం మాత్రం నాగబాబు ని ఆర్థికంగా కోలుకోలేని స్థాయి లో దెబ్బ తీసింది.

Naga Babu Varuntej

ఆ సమయం లో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ నాగబాబు ని ఆర్థికంగా బాగా ఆదుకున్నారు.. ఆ తర్వాత కొడుకు వరుణ్ తేజ్ హీరో గా బాగా సక్సెస్ అవ్వడం తో నాగబాబు కష్టాలన్నీ తీరిపోయాయి.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. ఇదంతా పక్కన పెడితే తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు నిహారిక కొణిదెల పెళ్లిని ఎంత వైభవంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే.

- Advertisement -
Naga Babu Family

కానీ వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటూ నాగబాబు ని మీడియా మిత్రులు మరియు విలేఖరులు అడుగుతూనే ఉంటారు.. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్నని అడిగితే నాగబాబు అందుకు సమాధానం చెప్తూ ‘సంబంధాలు చూస్తూ ఉన్నాం.. త్వరలోనే వాడికి తగ్గ వధువు దొరుకుంటుందని అనుకుంటున్నాను.. ఈమధ్యనే ఒక్క ఇల్లు కొన్నాడు.. పెళ్ళైన తర్వాత మా నుండి సెపెరేట్ అయ్యి వేరే కాపురం పెట్టబోతున్నాడు’ అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Varun Tej
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here