సింగర్ చిన్మయి శ్రీపాద మధురమైన వాయిస్‌కి కేరాఫ్ అడ్రస్. చిన్మయి పాట పాడినా.. డబ్బింగ్ చెప్పినా వినడానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కోపంలో ఉన్నా.. బాధలో ఉన్నా.. చికాగ్గా అనిపించినా ఈ సింగర్ పాటలు వింటే సరి.. క్షణాల్లో మూడ్ ఛేంజ్ అయిపోతుంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కాదు చిన్మయి సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఏ చిన్న మంచి, చెడు ఏం జరిగినా తన రెస్పాండ్ అవుతారు. మంచిని అభినందిస్తూ.. చెడును కడిగేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలను గొంతెత్తి చెప్పడంలో ఈ స్టార్ సింగర్ ఎప్పుడు ముందుంటారు. సోషల్ మీడియా ద్వారా చాలా మందికి విరాళాలు అందించి వారి విద్య, ఆరోగ్యానికి సహాయం కూడా చేశారు. మరోవైపు అమ్మాయిలు తాము తమ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేని విషయాలను కూడా చిన్మయితో షేర్ చేసుకుంటారు అంటే అమ్మాయిలపై ఆమె ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొన్నిసార్లు కొన్ని అంశాల్లో రియాక్ట్ అవ్వడం వల్ల వివాదాలు కూడా ఎదుర్కొన్నారు చిన్మయి. అలా వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా ఓ స్టార్ నటుడిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. పబ్లిక్‌లో ఓ హీరోయిన్ను కించపరిచే విధంగా మాట్లాడిన ఆ యాక్టర్ తీరును తప్పుబట్టారు. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోనీ, నటీ దర్శగుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ్ మూవీ ఓ మై ఘోస్ట్. ఈ సినిమాలో తమిళ్ యాక్టర్ సతీశ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌కు సన్నీ సంప్రదాయంగా చీరకట్టులో వచ్చింది. దర్శగుప్తా మోడ్రన్ లెహెంగాలో ఎంట్రీ ఇచ్చింది.
ఈ ఇద్దరు భామలు స్టేజ్ పైకి వెళ్తున్నప్పుడు నటుడు సతీశ్ దర్శగుప్తాపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. ‘ఎక్కబో ముంబయి నుంచి తమిళనాడుకు వచ్చిన సన్నీ లియోనీ పద్ధతిగా చీరకట్టుకుని వచ్చారు. చూడటానికి ఆమె చాలా అందంగా ఉన్నారు. కానీ అటూ చూడండి మన దగ్గరి అమ్మాయి మాత్రం మోడ్రన్ డ్రెస్ వేసుకుని వచ్చింది’ అంటూ దర్శగుప్తాను చూపిస్తూ అన్నాడు. అంతేకాదు తానేమి ఆమెను విమర్శించడం లేదని, జస్ట్ పాయింట్ అవుట్ చేశానంతేనని అనడంతో అక్కడి వచ్చిన వారంతా పగలపడి నవ్వారు.
సతీశ్ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. మహిళల డ్రస్సింగ్‌పై బహిరంగంగా కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ ఆమె ఘాటుగా స్పందించారు. ‘ఒక అమ్మాయిని టార్గెట్‌ని చేసి, ఆమె వేసుకున్న డ్రెస్‌పై విమర్శలు చేయడమేంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? మహిళల డ్రస్‌పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? ఇదేం అంత సరదా విషయం కాదు’ అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓవైపు చిన్మయిని సమర్థిస్తూ.. యూ ఆర్ రైట్ మాడమ్.. సెలెబ్రిటీలు అయినంత మాత్రానా అం మాట్లాడినా చెల్లుతుందనుకుంటారు కొందరు. కామెడీ పేరుతో మహిళలను కించపరచడం కొందరికి బాగా అలవాటు అయిపోందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో.. కూల్.. కూల్.. సతీశ్ జస్ట్ క్యూజువల్గా జోక్ వేశాడు. జోక్‌ని ఫన్‌గా తీసుకోవడం కూడా రాదు కొందరికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
I mean – To actually *point* at a woman and ask for mass heckling of a crowd by a man on a woman who doesn’t dress according to culture.
When will this behaviour from men stop?
Its not funny. pic.twitter.com/HIoC0LM8cM
— Chinmayi Sripaada (@Chinmayi) November 9, 2022