Kiara Advani : ‘గేమ్ చేంజర్’ సాంగ్ లో హీరోయిన్ వేసుకున్న డ్రెస్ ధరతో ఒక సినిమానే తీసేయొచ్చు.. శంకర్ ఎక్కడా తగ్గట్లేదుగా!

- Advertisement -

Kiara Advani : సౌత్ ఇండియా లో రాజమౌళి తో సమానంగా అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకులలో ఒకరు శంకర్. ఈయన మనం పుట్టకముందు నుండే పాన్ ఇండియన్ డైరెక్టర్. అప్పట్లోనే ముందు తరం ఆడియన్స్ ఆలోచనలకూ తగ్గట్టుగా మోస్ట్ అడ్వాన్స్ గా ఆయన సినిమాలు ఉంటాయి. అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్స్ లో ఒకరిగా ఇన్నాళ్లు కొనసాగిన శంకర్ రీసెంట్ గానే ఇండియన్ 2 చిత్రం తో మొట్టమొదటి డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఆయనకీ పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ చిత్రంతో పాటుగా ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.

Game Changer: 5 things we know about Ram Charan, Kiara Advani's film so far - Hindustan Times

రెండు సినిమాల షూటింగ్స్ ని బ్యాలన్స్ చేసుకుంటూ వచ్చేవాడు, ముందుగా ఇండియన్ 2 విడుదలైంది. ఇక రామ్ చరణ్ తో తీస్తున్న గేమ్ చేంజర్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కేవలం ఒక్క పాట మినహా, ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల కాలేదు. అభిమానులు టీజర్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ, నేడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ‘కియారా అద్వానీ’ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి సంబంధించిన పోస్టర్ ని ఒకటి విడుదల చేసారు. ‘జరగండి జరగండి’ లో ఆమె వేసుకున్న కాస్ట్యూమ్ కి సంబంధించిన స్టిల్ ని విడుదల చేసారు.

- Advertisement -
Kiara Advani
Kiara Advani

అయితే ఈ కాస్ట్యూమ్ ధర ఎంతో తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ కి గురి అయ్యారు. శంకర్ తన సినిమాల్లోని పాటల విషయం లో బడ్జెట్ గురించి అసలు తగ్గడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఆయన పాటలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో హీరోయిన్ కియారా అద్వానీ వేసుకున్న కాస్ట్యూమ్ విలువ దాదాపుగా 60 లక్షల రూపాయిల వరకు ఉంటుందని అంటున్నారు. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్న అంశం. ఈ పాట వెండితెర మీద చూసేటప్పుడు అదిరిపోతుందని, పాటలో రామ్ చరణ్ ఎన్నో అద్భుతమైన స్టెప్పులు వేసాడని, థియేటర్స్ లో ఆడియన్స్ మెంటలెక్కిపోతారని ఈ సినిమాకి సంగీతం అందించిన థమన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మరి వెండితెర మీద ఈ పాట అంచనాలకు తగ్గట్టుగానే శంకర్ మార్కు లో ఉండబోతుందా లేదా అనేది చూడాలి.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here