Tollywood ​ డైరెక్టర్లకు కొరియన్ రీమేక్​లంటే ఎందుకంత మోజు..?

- Advertisement -

Tollywood : ప్రజెంట్ ట్రెండ్ అంతా రీమేక్​లదే. టాలీవుడ్-కోలీవుడ్-మాలీవుడ్-శాండల్​వుడ్-బాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాను తమ ఇండస్ట్రీలో రీమేక్ చేసి వదులుతున్నాయి. ఏ మాత్రం కష్టపడకుండా మక్కీకి మక్కీ కొట్టేస్తున్న వాళ్లు కొందరైతే.. నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రిలీజ్ చేస్తున్న వాళ్లు మరికొందరు. అయితే రీమేక్​లు అందరికి అచ్చిరావడం లేదు. కొందరు మాత్రం రీమేక్​లతోనే హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నారు.

Tollywood Directors on Korean movies
Tollywood Directors on Korean movies

అయితే ఇన్నాళ్లు రీమేక్​లంటే ఇండియన్ భాషల్లోని సినిమాలే అనుకునేవారు. దర్శకులు కూడా భారతీయ భాషల్లోని సినిమాలనే రీమేక్ చేసి.. ఒక భాషలోని మూవీ మరో భాషలో రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రీమేకింగ్ హద్దులు దాటి హాలీవుడ్​ వరకు వెళ్లింది. అక్కడితోనే ఆగకుండా కొరియా వరకూ చేరింది. ఇంగ్లీష్​తో పాటు ఇప్పుడు కొరియన్ సినిమాల రీమేక్ ట్రెండ్ టాలీవుడ్​లో పెరిగిపోతోంది.

గతంలో చాలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్​ని మలుపు తిప్పిన `ఖైదీ` నుంచి చాలా వరకు హాలీవుడ్ సినిమాలని తాపీగా కాపీ చేస్తూ మక్కీకి మక్కీ లేపేసి ఫ్రీగా రీమేక్​లు చేస్తూ వచ్చారు తెలుగు దర్శకులు కొందరు. `ఖైదీ` మూవీని హాలీవుడ్​లో సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన `ఫస్ట్ బ్లడ్` ఆధారంగా మన తెలుగు నేటివిటీకి మార్పులు చేసి తెరకెక్కించారు. ప్రధాన యాక్షన్ ఘట్టాలు చాలా వరకు యాజిటీజ్​గా దింపేశారు.

- Advertisement -

నిన్న మొన్నటి సాహో, అజ్ఞాతవాసి కూడా ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ `లార్గోవించ్` నుంచి లేపేశారంటూ సదరు మూవీ దర్శకుడు జెరోమ్ సల్లే సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరగడం.. హాలీవుడ్ కూడా ఇండియన్ సినిమాపై ఓ కన్నేస్తుండటంతో విమర్శలకు తావివ్వకుండా తెలుగు దర్శకులు రీమేక్​లను ఫ్రీమేక్ చేయడం మానేసి.. కాస్త బ్రెయిన్ పెట్టి కేవలం కీలక అంశాన్ని మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకుంటున్నాయి. స్టోరీ లైన్ తీసుకుని దాన్ని నేటివిటీకి తగ్గట్లు మార్పు చేసి రీమేక్ చేసి వదులుతున్నారు.

ఇక ఇంగ్లీష్ సినిమా రీమేక్​లపై మోజు తగ్గడంతో టాలీవుడ్ డైరెక్టర్లు కొరియన్ సినిమాలపై ఫోకస్ చేశారు. ఇప్పటికే కొరియన్ సినిమాలను చాలానే తెలివిగా తెలియకుండా.. అర్థం కాకుండా స్టోరీ లైన్ తీసుకుని డెవలప్ చేశారనే వార్తలు వినిపించాయి. అందులో ఒకటి నేచురల్ స్టార్ నాని నటించిన పిల్ల జమీందార్. ఈ సినిమా కొరియన్ మూవీ ‘ఏ మిలియనీర్ ఫస్ట్ లవ్’ స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

ఆ తర్వాత టాలీవుడ్​లో కొరియన్ సినిమాల హవా నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం కొరియన్ మూవీ ప్యార్లల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కించారని ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత నటించిన ఓ బేబీ సినిమా కొరియన్ చిత్రం మిస్ గ్రానీ ఆధారంగా రూపొందించిందే.

ఇటీవల రెజీనా నివేథా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ శాకిని డాకిని కూడా మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ చిత్రం ఆధారంగా తీసిందే. అయితే ఓ బేబీ ప్రొడ్యూసర్ సునీత తాటి మరో ఐదారు కొరియన్ సినిమాలను రీమేక్ చేసే పనిలో పడ్డారట. ఇప్పటికే ఆ సినిమాల రీమేక్ రైట్స్​ను కూడా కొనేశారట. ఆ చిత్రాలకు సంబంధించిన స్క్రిప్టును నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేేసే పనిలో ప్రస్తుతం సునీత బిజీగా ఉన్నారట.

అయితే టాలీవుడ్​లో క్రియేటివిటీకి కొదువ లేదు. కొత్త దర్శకులకు కరువు లేదు. కంటెంట్ ఉంటే చాలు హీరో, డైరెక్టర్ ఎవరని చూడకుండా సినిమాను నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతలు తక్కువేం లేరు. అయినా కొరియన్ సినిమాలు రీమేక్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుందనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here