Salaar : రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఇంతపెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో వచ్చిన వసూళ్లను చూసి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ, ఫైనల్ రన్ కేవలం 600 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద ఆగింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే అంశాలు సినిమాలో ఎక్కువ లేకపోవడం వల్లే అనుకున్న టార్గెట్ ని చేరుకోలేదని అంటుంటారు ట్రేడ్ పండితులు. కానీ రీసెంట్ గా విడుదలైన ‘కల్కి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కు వైపు ఈ చిత్రం పరుగులు తీస్తూ ఉంది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సలార్ చిత్రం కూడా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందా అంటే, అందుకోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే సలార్ చిత్రం రీసెంట్ గానే జపాన్ లో భారీ లెవెల్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకి అక్కడ మంచి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు వసూళ్లు అదిరిపోయాయి. జపాన్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రాన్ని మొదటి రోజు 11 వేల 600 మంది చూడగా, 18.2 జపనీస్ మిలన్ డాలర్లు వచ్చాయట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 94 లక్షల రూపాయిల గ్రాస్ అన్నమాట. గతం లో విడుదలైన #RRR చిత్రానికి 44 జపనీస్ మిలియన్ డాలర్లు రాగ, సాహూ చిత్రానికి 23 మిలియన్ డాలర్లు వచ్చాయి.
ఈ రెండు చిత్రాల తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సలార్ నిల్చింది. జపాన్ లో కంటెంట్ ఉండే సినిమాలకు లాంగ్ రన్ ఎవ్వరూ కలలో కూడా ఊహించని స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా #RRR చిత్రం గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇండియా లో విడుదలై బంపర్ హిట్ గా నిల్చిన తర్వాత కొన్నాళ్ళకు ఈ సినిమాని జపాన్ లో విడుదల చేశారు మేకర్స్. అక్కడ ఇండియాలో కంటే ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా సంవత్సరం రోజులు థియేటర్స్ లో విజయవంతంగా నడిచి 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. సలార్ చిత్రం లో కూడా కంటెంట్ బాగుంటుంది కాబట్టి ఫైనల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని ముట్టుకోనుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.