Raghava Lawrence : స్వయంకృషి తో, సొంత టాలెంట్ తో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారిలో ఒకరు రాఘవ లారెన్స్. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకడిగా ఉన్న అతని టాలెంట్ ని గమనించి మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రి సినిమాలో కొన్ని పాటలకి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని లారెన్స్ ఇచ్చాడు. తనకి వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటూ రాఘవ లారెన్స్ మొదటి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి చేత అద్భుతమైన స్టెప్పులు వేయించి మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సౌత్ ఇండియా లో ప్రభుదేవా తో సమానమైన ఇమేజిని డ్యాన్స్ మాస్టర్ గా సంపాదించుకున్నాడు. అలా డ్యాన్స్ మాస్టర్ గా మాత్రమే కాదు, దర్శకుడిగా, హీరో గా కూడా ఆయన అద్భుతంగా రాణించి ఎన్నో సక్సెస్ లను అందుకున్నాడు.

ఇప్పుడు ఆయనకీ అటు తమిళంలో , ఇటు తెలుగు లో సమానమైన మార్కెట్ ఉంది. ఆయన సినిమా విడుదలైతే మాస్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడాల్సిందే, ఆ రేంజ్ కి ఎదిగాడు. ఇదంతా పక్కన పెడితే సేవ కార్యక్రమాల్లో రాఘవ లారెన్స్ కి స్టార్ హీరోలు కూడా సరితూగరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వికలాంగులకు డ్యాన్స్ నేర్పించడం, ఆకలితో ఉన్నవారికి అన్నంపెట్టడం, పిల్లల్ని చదివించడం ఇలా ఒక్కటా రెండా ఎన్నో పుణ్య కార్యాలు చేసాడు.
కేవలం తాను మాత్రమే చెయ్యకుండా తన కొడుకుని కూడా తనలాగే మార్చేశాడు. రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో తన కొడుకు గురించి ఒక ట్వీట్ వేస్తూ ‘ నాకొడుకు నేడు ఎంతో ఉదారస్వభావుడిగా మారడం నాకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది. అతని పేరు శ్యామ్, ప్రస్తుతం కాలేజీ లో మూడవ సంవత్సరం చదువుతూ, పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు. నేను హెప్పిబా అనే అమ్మాయిని గత పదేళ్ల నుండి చదివిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఆమె తన అమ్మమ్మ దగ్గర ఉంటుంది.
ఈ ఏడాది ఆమె చదువు కోసం నా కొడుకు శ్యామ్ తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఆ అమ్మాయి ఫీజు కట్టాడు. ఇలాంటి ఆనందకరమైన విషయాన్నీ మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. శ్యామ్ సేవ యాత్రకి మీ అందరి దివ్యమైన ఆశీస్సులు ఉండాలి’ అంటూ లారెన్స్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ మారింది. అయితే ఈ ఫొటోలో ఉన్న లారెన్స్ కొడుకు ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొడుకు హీరోలా ఉన్నాడు,, రాబొయ్యే రోజుల్లో ఇండస్ట్రీ లోకి వచేస్తాడేమో అని అనుకుంటూ ఉన్నారు. మరి శ్యామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది లారెన్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.