Klinkaara Video : క్లింకారా బర్త్ డే స్పెషల్ వీడియోను షేర్ చేసిన ఉపాసన..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మనమరాలు, రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకారా పుట్టినరోజు రోజు సందర్బంగా ఉపాసన ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. క్లీంకార మొదటి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసన ముద్దుల కూతురికి ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు…

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో ఉపాసన మాట్లాడుతూ.. నా డార్లింగ్ క్లీంకారకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా అందరి జీవితాల్లో ఆనందం నింపినందుకు థాంక్యూ. అంటూ ఉపాసన విషెస్‌ చెప్పారు.. ఆ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే ఓ రేంజులో వ్యూస్ ను రాబట్టింది. అలాగే రామ్ చరణ్ కూడా తన కూతురు పుట్టిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది షేర్ చేశాడు..

- Advertisement -

రామ్ చరణ్‌, ఉపాసనలతో పాటు ఇరు కుటుంబాల వారు క్లీంకార పుట్టినప్పుడు తమ ఆనందాన్ని పంచుకున్నారు. గతేడాది ఉపాసన పుట్టినరోజు నాడు రామ్ చరణ్‌ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడు అదే వీడియోను ఉపాసన పంచుకున్నారు. ఇక ఈ వీడియోలో చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులందరూ క్లీంకార వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నారో అనే విషయాన్ని వీడియోలో క్లియర్ గా చూపించారు.. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ లతో సినిమాలు చెయ్యబోతున్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here