Shruti Haasan గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటించింది. అవి మంచి హిట్ ను అందుకోవడం తో సంక్రాంతి హీరోయిన్ అయ్యింది. అయితే గత కొద్ది రోజుల నుంచి శృతిహాసన్ పెళ్లిపై వార్తలు వినిపిస్తున్నాయి..తాజాగా త్వరలో పెళ్లి అని వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు నిజమేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
సూపర్ స్టార్ కమలహాసన్ కూతురు అయినా కూడా ఈమె మొదటి నుండి ఒక సాధారణ హీరోయిన్ మాదిరిగానే సాగింది. తన తండ్రి స్టార్ డం ను ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకొని ముందుకు సాగింది. ఇదిలా ఉండగా.. ఆమె ప్రేమ విషయాన్ని ఇతర విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తున్న శృతిహాసన్ గత కొద్దిరోజులుగా డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతను హజారికా తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
వీరిద్దరూ ప్రేమలో ఉండడమే కాదు సహజీవనం కూడా చేస్తున్నారు. తాజాగా ఇతడి గురించి పదే పదే పోస్టులు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. ఈ విషయంపై శృతి హాసన్ సన్నిహితులు మాత్రం ఈ ఏడాదిలో పెళ్లి అని చెప్తున్నారు.
శృతిహాసన్, శాంతను హజారికల వివాహానికి రెండు వైపుల కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని దాంతో సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోబోతున్నారు అని సమాచారం. ఇకపోతే శృతిహాసన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో కెరియర్ను కంటిన్యూ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. మొత్తానికి తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి సిద్దమైంది.. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు..