Kalki 2898 AD : రాంచరణ్, ఉపాసనల కూతురికి కల్కీ టీం ఊహించని స్పెషల్ గిఫ్ట్

- Advertisement -

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’. అయితే కల్కి మూవీలోని బుజ్జిని లాంచ్ చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌ సరికొత్తగా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినిమాలో క్యారెక్టర్స్ తో కాకుండా ప్రభాస్ వాడిన వెహికల్, బుజ్జి అనే చిన్ని రోబోతో కల్కి ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర బృందం. ఇటీవలే బుజ్జి & భైరవ యానిమేషన్ సిరీస్ కూడా వచ్చింది. బుజ్జి, భైరవ క్యారెక్టర్స్ తో ఈ సినిమాను పిల్లలకు బాగా దగ్గర చేయాలనుకున్న మూవీ టీం ఈ క్రమంలో బుజ్జి, భైరవ స్టిక్కర్స్, బొమ్మలు, టీషర్ట్స్ విక్రయిస్తున్నారు. అలాగే కొంతమందికి ఉచితంగా కూడా అందజేస్తున్నారు. తాజాగా సినీ పరిశ్రమలోని సెలబ్రిటీ పిల్లలకు కల్కి మూవీ టీం నుంచి బుజ్జి & భైరవ స్పెషల్ గిఫ్టులు పంపిస్తున్నారు.

అందులో భాగంగానే రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాకు కూడా కల్కి టీమ్ ఈ బుజ్జి గిఫ్ట్ ని పంపించింది . ఈ గిఫ్ట్ లో ఆ వాహనం బొమ్మ, బుజ్జి రోబో బొమ్మ, కొన్ని స్టిక్కర్స్, కల్కి పోస్టర్స్, ఒక లెటర్ ఉన్నాయి. క్లిన్ కారా ఆ బుజ్జి వెహికల్ తో ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పింది. దాంతో పాటు కల్కి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. దీంతో ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోలో కూడా క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు ఉపాసన. అలాగే ఈ బుజ్జి గిఫ్టులు సినీ పరిశ్రమలోని మరి కొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా పంపిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ‘కల్కి 2898 AD’ సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. పిల్లలకు దగ్గరయి వాళ్లతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాకు వచ్చేలా మూవీ టీం ప్రమోషన్స్ చేస్తున్నారు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here