Varalaxmi : ఆయనొక్కడేనా.. మా నాన్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇచ్చి పడేసిన వరలక్ష్మీ

- Advertisement -

Varalaxmi : వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. స్టార్ హీరో శరత్ కుమార్ కూతురిగా అందరికీ సుపరిచితమే. కెరీర్ మొదట్లో హీరో విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు పలు హిట్ చిత్రాల్లో కీలకపాత్రలను పోషిస్తూ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గా తేజా సజ్జా నటించిన ‘హనుమాన్’ మూవీలో అక్క పాత్రలో చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరలక్ష్మి పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఆమె వ్యక్తిగత విషయాలకొస్తే.. తాను ఇటీవలే నీకోలయ్ సచ్‌దేవ్‌తో ఎంగేజ్ మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో వరలక్ష్మికి కాబోయే భర్త నికోలయ్‌ వివరాలు వెతికే పనిలో పడ్డారు నెటిజన్స్.

నికోలయ్ కు ఇప్పటికే పెళ్లి జరిగి ఓ కూతురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫొటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో అంతా వరలక్ష్మి రెండో పెళ్లి వాడిని చేసుకుంటుందని నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా, వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ ప్రమోషన్స్‌లో పాల్గొని తనకు కాబోయే భర్తపై వచ్చే ట్రోల్స్ మీద స్పందించింది. ‘‘ నేను నిక్‌తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నప్పటి నుంచి రెండో పెళ్లి వాడంటూ నిక్ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఆయన హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. నిక్ ఒక్కడే రెండో పెళ్లి చేసుకోవట్లేదు కదా.. అంతకు ముందు మా ఇంట్లోనే మా నాన్న కూడా రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

ఆయన ఆనందంగా ఉన్నంత వరకు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. కాబట్టి మా బంధంపై వస్తున్న ట్రోల్స్‌ను నేను లెక్క చేయను. అయినా వాటన్నింటికీ నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి. ఆ అవసరం నాకు లేదు. నాకు నిక్ మాజీ భార్య తెలుసు. ఆమె వ్యక్తిత్వం నాకు నచ్చింది. నిక్ అతని కుమార్తె, పవర్లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. అతను నాకు 14 ఏళ్ల క్రితం నుంచే తెలుసు. మేము తొలిసారి మీట్ అయి.. తర్వాతే ఫ్రెండ్స్ అయ్యాం. అదే ఇటీవల ప్రేమగా మారింది. అందుకే త్వరలో దంపతులుగా మారబోతున్నాము. అతను నన్ను బాగా నవ్విస్తారు. అంతేకాకుండా నా కెరీర్ విషయంలో ఫుల్ సపోర్ట్‌గా ఉంటాడు. జీవితాంతం నిక్‌తో సంతోషంగా ఉండగలనన్న నమ్మకం అయితే నాకుంది. కాబట్టే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ట్రోల్స్ ఎన్ని వచ్చినా సరే పట్టించుకోను’’ అంటూ వరలక్ష్మి ఫుల్ క్లారిటీగా చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here