Faria Abdullah : చిట్టీకి పొట్టిగా ఉన్న వాడే కావాలట.. ఫరియా అబ్దుల్లా విచిత్రమైన కోరిక

- Advertisement -

Faria Abdullah : ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021లో జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు పొడవుగా కనిపించే ఈ క్యూటీ తన అందాలు, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె అదే ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కూడా చేసింది. ఆ తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్, రావణాసుర వంటి సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలన్నీ అమ్మడి కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. వరసుగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను పోస్ట్ చేస్తుంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. ‘అల్లరి’ నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎత్తు ఉన్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన ఫరియా అబ్దుల్లా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఏ విధంగా ఉండాలో ఇటీవల చెప్పుకొచ్చారు. నాకు కాబోయే భర్త తన కంటే పొట్టిగా ఉన్నా ఏమాత్రం అభ్యంతరం లేదంటూ చెప్పుకొచ్చింది. కాకపోతే తనకు కాబోయే భర్తలో మంచి హాస్య చతురత ఉండాలని సూచించింది. అలాంటి ఫన్ కుర్రాడు దొరికితే నాకంటే పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ లైఫ్ లో అన్నీ బాధలే అని కనీసం పెళ్లి చేసుకోబోయేవాడు ఫన్ గా ఉంటే బాగుంటుంది కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మ్యాట్రిమోనీ సైట్ లో వివరాలు ఇవ్వాల్సి వస్తే నేను హీరోయిన్ అనే విషయాన్ని మాత్రం దాచిపెడతానని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

తన ఫోటోను కూడా లైట్ గా బ్లర్ చేస్తానని ఆమె తెలిపారు. తాను హీరోయిన్ అని తెలిస్తే వేర్వేరు ఆలోచనలు, అంచనాలు ఉంటాయని ఫరియా అబ్దుల్లా కామెంట్లు చేశారు. తాను హీరోయిన్ కాదని తెలిస్తే ఎదుటి వ్యక్తి నుంచి నిజాలు బయటికి వస్తాయన్నారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఫరియా అబ్దుల్లా మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికీ ఫరియా అబ్దుల్లా రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here