Hyper Aadi : బుల్లితెర పై జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హైపర్ ఆది. షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చి.. తక్కువ కాలంలోనే తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్నాడు ఆది. తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.

తన పంచ్ డైలాగులతో టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి.. అదే లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితమే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం టెలివిజన్ షోలలో హయ్యెస్ట్ పెయిడ్ కమెడియన్ లలో ఒకరిగా ఉన్నాడు. ఓ వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలు చేస్తూనే మరోవైపు సినిమా ఛాన్సులు కూడా అందుకుంటున్నాడు. అయితే తాజాగా ఆయన తన అభిమానులకు పెళ్లి అయిందని చెప్పి షాక్ ఇచ్చాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి తన భార్యను తీసుకు వచ్చాడు. ఆమె ఎంట్రీ చూసిన ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారి నిజమైన భార్య అంటూ చెప్పుకొచ్చాడు.

ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నానంటూ వివరించాడు. అప్పుడే యాంకర్ రష్మి హైపర్ ఆది భార్యను స్టేజ్ మీదకు పిలిచింది. అయితే వెంటనే వచ్చిన ఆమె.. మాస్క్ పెట్టుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంది. గ్రీన్ కలర్ చీరలో ముద్దుగుమ్మలా ఉన్న ఆమె తెలుగు అమ్మాయి కాదని తెలుస్తోంది. వేరే దేశపు అమ్మాయిని తీసుకు వచ్చి స్కిట్ లో భాగంగా ఇలా యాక్ట్ చేయించినట్లు అర్థం అవుతుంది. ఈ అందమైన నా భార్య మొహాన్ని నేనే ఇప్పటి వరకు చూడలేదని.. ఆమె భర్త మాట కంటే మేనేజర్ మాటనే ఎక్కువగా వింటుందని.. అలాగే తాను పిలిచినా రాదని.. మేనేజర్ వెళ్లమంటే మాత్రం కచ్చితంగా వెళ్తుందంటూ ఫన్ క్రియేట్ చేశాడు. ఇలా పదే పదే హైపర్ ఆది తన స్కిట్స్లో తన భార్యే అంటూ అనేక మంది అమ్మాయిలను స్టేజి మీదకు తీసుకు వస్తున్నారు. దీంతో అభిమానులంతా ఆగ్రహిస్తున్నారు. ఇదంటూ టీఆర్పీ కోసమే అంటే ఏకి పారేస్తున్నారు.