Bigg Boss : ఏ భాషలో తీసినా హయ్యెస్ట్ టీఆర్పీతో అతి పెద్ద రియాలిటీ షోగా రికార్డులను క్రియేట్ చేసింది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికీ ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఎనిమిదో సీజన్ ప్రారంభం కాబోతుంది అంటున్నారు జనాలు. ఇప్పటికే బిగ్ బాస్ మేనేజ్మెంట్ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో పాల్గొనాల్సిన స్టార్స్ లిస్ట్ రెడీ చేసేసిందట . ఎటువంటి కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తే హ్యూజ్ టీఆర్పీలు వస్తాయి అన్న రేంజ్ లో మాస్ మసాలా కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లని ని హౌస్ లోకి పంపిస్తున్నారట.
బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. విజేతగా పల్లవి ప్రశాంత్‌ని.. రన్నర్‌గా అమర్ దీప్‌ని ప్రకటించడం వివాదం కాగా.. సీజన్ 7 అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 6 వరస్ట్ సీజన్‌గా నిలవడంతో.. ఆ తప్పు మళ్లీ జరగకుండా సీజన్ 7 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక.. టాస్క్‌లు.. ఎలిమినేషన్స్.. నామినేషన్స్.. విజేత ఎంపిక ఇవన్నీ చాలా ట్విస్ట్‌లతో సాగింది.

ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8 కూడా ఏడో సీజన్ కంటే గ్రాండ్ సక్సెస్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ షో గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇన్నాళ్లు బిగ్ బాస్ ని హోస్ట్ చేసేది నాగార్జున, రానా, విజయ్ దేవరకొండ, బాలయ్య అంటూ ప్రచారం జరిగింది . కానీ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని హీరో తెరపైకి వచ్చాడు .
టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాచో స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న గోపీచంద్ బిగ్ బాస్ షోను హోస్ట్ చేయబోతున్నారట. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం అంటున్నారు కొంతమంది జనాలు. అసలు క్రేజేలేని గోపీచంద్ ని ఎందుకు హోస్టుగా తీసుకున్నారని ఓ వైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే గోపీచంద్ ను తీసుకోమని ప్రభాస్ రికమండేషన్ చేశారని.. ఆ కారణంగానే బిగ్ బాస్ మేనేజ్మెంట్ గోపీచంద్ ని హోస్ట్ గా ఓకే చేసిందట. అంతేకాదు ఫైనల్ ఎపిసోడ్ కి ప్రభాస్ గెస్ట్ గా వస్తానని మాట ఇచ్చిన తర్వాతే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతోంది.