Tillu Square సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించింది. సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే అందులోని నటీనటులకు వరుస ఆఫర్లు వస్తుంటాయి. కానీ ఈ నూడుల్స్ భామ విషయంలో అలా జరగలేదు. మరోవైపు ఈ బ్యూటీకి నెక్స్ట ఎలాంటి స్క్రిప్టు ఎంచుకోవాలో అర్థంగాక తల పట్టుకుంటోందట. ఎందుకంటే

‘ప్రేమమ్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, ‘అఆ’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లింది. అయితే ఈ భామ మొన్నటిదాక చేసిన అన్ని సినిమాల్లో సంప్రాదయ పాత్రల్లోనే కనిపించింది. ముఖ్యంగా పక్కింటి అమ్మాయి వంటి పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది.
అయితే ఒకే రకం పాత్రలు చేస్తే అలాంటి అవకాశాలే వస్తాయి. అందుకే అనుపమకు దాదాపుగా అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి. కానీ టిల్లు స్క్వేర్ మాత్రం చాలా డిఫరెంట్. ఈ సినిమాతో ఈ మల్లు బ్యూటీ కూడా బోల్డ్ రోల్ లో ఎంట్రీ ఇచ్చింది. లిప్ లాక్స్, బోల్డ్ డైలాగ్స్, బోల్డ్ సీన్లతో ఇన్నాళ్లూ మనం చూసింది అనుపమేనా అనేలా చేసింది. అయినా తన బోల్డ్ పర్ఫామెన్స్ తో ఈ భామ ప్రేక్షకులను మెప్పించింది. ‘టిల్లు స్క్వేర్’తో సడెన్‌గా ఈ బ్యూటీ ఇమేజ్ మారిపోయింది.
ఇక తనకు నెక్స్ట్ కూడా ఇలాంటి క్యారెక్టర్లే వస్తున్నాయట. ఒకే తరహా పాత్రలు చేస్తున్నాననే రూట్ మార్చి బోల్డ్ హీరోయిన్ అవతారమెత్తిన అనుపమకు మళ్లీ ఈ బోల్డ్ రోల్ ఆఫర్లే వస్తుండటంతో నెక్స్ట్ ఏంటి అంటూ తల పట్టుకుంటోందట ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ అవే రోల్స్‌లో కనిపించేందుకు తాను సిద్ధంగా లేనని నిర్మాతలకు చెప్పేస్తుందట. గ్లామరస్ పాత్రలకు ఓకే అంటే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు క్యూ కట్టినా.. ఇప్పటికే కొన్నింటికీ నో చెప్పేసిన అను మిగిలిన వాటికి ఏం చెప్పాలో అర్థం కాక సందేహంలో పడిందట.
‘టిల్లు స్క్వేర్’ సినిమాలో కథ డిమాండ్‌కు తగ్గట్టుగా అనుపమకు బోల్డ్‌నెస్ పాత్రలో కనిపించక తప్పలేదు. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుంది కదా అని మరోసారి ఆ పాత్రలు చేయడానికి తాను రెడీగా లేదట. మళ్లీ సంప్రదాయ, ఫ్యామిలీ రోల్స్‌లో నటించి స్టోరీ డిమాండ్ మేరకు బోల్డ్‌గా కనిపించాలనుకుంటుందట. ఏదేమైనా, ‘టిల్లు స్క్వేర్’ అనుపమను డైలమాలో పడేసిందన్నమాట. ఆమె నెక్స్ట్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి మరి.