Anushka : మిర్చి సినిమాలో ప్రభాస్ ను ఎత్తుకునే సీన్ ముందు ఆ డ్రింక్ తాగిన అనుష్క.. అందుకే అంత పవర్

- Advertisement -

Anushka : సాధారణంగా మనం సినిమాల్లో చాలా వరకు హీరోయిన్స్ ని హీరోలు ఎత్తుకోవడమే చూస్తుంటాం. రొమాంటిక్ సీన్స్ లో.. పలు సందర్భాలలో హీరోయిన్లను హీరోలు అవలీలగా ఎత్తేస్తుంటారు. అయితే వాటికి భిన్నంగా మొదటి సారి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒక హీరోయిన్ చేత ఒక హీరోని ఎత్తుకునేలా చేస్తాడు. ఆ సినిమా మరేదో కాదు మిర్చి . కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిర్చి’. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

అంతేకాదు ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది. అంతే కాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికి ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా జనాలకి వన్ ఆఫ్ ది టాప్ టెన్ మూవీగా నిలిచిపోయే విధంగా నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క.. ఒక సీన్ లో హీరో ప్రభాస్ ను అమాంతం ఎత్తేసుకుంటుంది. ఆరడుగుల కటౌట్ ఉన్న ప్రభాస్ ని అలా అమాంతం ఎత్తుకోవడం అంటే మాటలా ..? అయితే హీరోయిన్ అనుష్క ఎలా ఎత్తుకుంది..? ఇదంతా గ్రాఫిక్స్ ఏమో..? అంటూ అప్పట్లో బాగా చర్చలు నడిచాయి.

- Advertisement -

అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్, అనుష్క దీనికి క్లారిటీ ఇచ్చారు. అది గ్రాఫిక్స్ కాదు అని .. నిజంగానే అనుష్క ఎత్తుకుంది అని.. ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మొదట స్టూల్ మీద నిల్చున్నాను.. ఆ తర్వాత ఆమె నా కాళ్లను గట్టిగా పట్టేసుకుంది అని .. ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు స్టూల్ తీసేసారని .. అప్పుడే ఆమె నన్ను లిఫ్ట్ చేసింది అని ..ఎక్కడ పడేస్తుందో బాబోయ్ అంటూ భయపడ్డాను అని చెప్పుకొచ్చాడు. అయితే అనుష్కకు అంత బలం ఉందా..? అంటే మాత్రం ఆ సీన్ చేసే ముందు ఆమె చేత డైరెక్టర్ కొరటాల శివ స్పెషల్ మిల్క్ షేక్స్ తాపించారట.. అందుకే అంత బలంగా గట్టిగా మోయగలిగింది అంటున్నారు జనాలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here