Akhanda2 : ‘అఖండ2’ స్టోరీ లీక్.. ఈసారి బాలయ్య ఫైట్ ఫ్యామిలీ కోసం కాదట

- Advertisement -

Akhanda2 : నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకు పండగే. ఈ ఇద్దరి సినిమాతో థియేటర్లు బద్ధలవ్వాల్సిందే. బాక్సాఫీస్ కలెక్షన్లు పరుగులు పెట్టాల్సిందే. ఇక మాస్ ప్రేక్షకులు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రకటన నుంచి థియేటర్ లో రిలీజ్ అయ్యే వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే ఈ కాంబోలో తెరకెక్కిన సినిమాలు సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ బంపర్ హిట్లే. ఇక 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ చిత్రం బాలయ్య కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు.

కరోనా తర్వాత థియేటర్లకు జనాలు వస్తారో రారో అన్న భయంలో విడుదలైన అఖండ సినిమా ప్రేక్షకులకు ఆ భయాన్న వదిలించి థియేటర్లకు పరుగులు పెట్టించేలా చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా స్టోరీ లైన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు థియేటర్లో పూనకాలే వచ్చాయి. అందుకే ఈ బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారు దర్శకుడు బోయపాటి.

- Advertisement -

తాజాగా అఖండ-2 గురించి బోయపాటి శ్రీను లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉండటంతో ప్రచారంలో బాలయ్య బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఎన్నికలు పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన చేస్తామని బోయపాటి చెప్పారు. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించగా.. దీని సీక్వెల్‌లో సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుందని బోయపాటి చెప్పారు. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని తెలిపారు. ఇప్పటికే దీని స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభమైనట్లు సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ..  బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన క్లాస్‌ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే దీనిలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం ఉంటుందని సమాచారం. ఇందులో మలయాళం అగ్ర హీరో కూడా నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here