Ravi Teja : మహేశ్, బన్నీ, విజయ్.. ఇప్పుడు రవితేజ.. ఆ బిజినెస్ లోకి వరుసగా టాలీవుడ్ హీరోలు

- Advertisement -

Ravi Teja : సాధారణంగా సినిమా నటుల కెరీర్ స్పాన్ మిగతా రంగాలతో పోలిస్తే కాస్త తక్కువనే చెప్పొచ్చు. ఎంత టాలెంట్ ఉన్నా కాస్త అదృష్టం కూడా కలిసి వస్తేనే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. ఎప్పుడు అవకాశాలు గుడ్ బై చెప్పేస్తాయే.. ఎప్పుడు దుకాణం కట్టేసి సర్దుకొని వెళ్లాల్సి వస్తుందో తెలియదు. అందుకే చాలా మంది నటుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే తమ వృత్తితో పాటు సైడ్ ఇన్ కమ్ వచ్చే వ్యాపారాలు చేస్తుంటారు.

Ravi Teja
Ravi Teja

అయితే కొందరు డైరెక్ట్ గా వ్యాపార రంగంలోకి అడుగు పెడితే మరి కొందరు సేఫ్ గా మంచి లాభాలు వచ్చే వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ భాగస్వాములుగా ఉంటారు. ఇక టాలీవుడ్ లో అలాంటి హీరోలు, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కొందరు వేరే వ్యాపారాలు పెట్టుకుంటే.. మరికొందరు తమకు బాగా తెలిసింది సినిమాయేనని ఇక్కడే ప్రొడక్షన్ హౌసులు గట్రా పెట్టేసుకుంటున్నారు.

mahesh babu

- Advertisement -

టాలీవుడ్ లో కొంత మంది హీరోలు ఇప్పటికే ప్రొడక్షన్ హౌసులు పెట్టేసి సినిమాలు కూడా నిర్మించేస్తున్నారు. ఇంకొందరేమో ఎగ్జిబిటర్లుగా, థియేటర్ల యజమానులుగా సెటిల్ అవుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మల్టీప్లెక్సుల అధిపతులుగా మారిన విషయం తెలిసిందే. ఏసియన్ మహేశ్ బాబు సినిమా (AMB Cinema), ఏసియన్ అల్లు అర్జున్  (AAA Cinema) సినిమా, ఏసియన్ విజయ్ దేవరకొండ సినిమా (AVD Cinema) ఇలా స్టార్ హీరోలు థియేటర్ ఓనర్లుగా మారిపోయారు. ఇందులో మహేశ్ బాబు, బన్నీ థియేటర్లు హైదరాబాద్ లో ఉంటే, విజయ్ ది మాత్రం మహబూబ్ నగర్ లో ఉంది.

ఇక తాజాగా ఈ బిజినెస్ లోకి మాస్ మహారాజ రవితేజ ఎంటర్ అయ్యాడు. స్వశక్తిని నమ్ముకుని గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా కిందా మీద పడుతూ, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు రవితేజ. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ చివరకు హీరో అయ్యాడు. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ గా వెెండితెరను ఏలుతున్నాడు. తాజాగా రవితేజ థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ లో ఏసియన్ రవితేజ సినిమా (ART Cinema) పేరుతో థియేటర్ కు శ్రీకారం చుట్టాడు. ఇందుకు సంబంధించి ఇవాళ పూజా కార్యక్రమం కూడా జరిగింది.

ఇటీవలే అక్కడ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఏషియన్‌ సినిమాస్‌ కు చెందిన వారితో పాటు హీరో దగ్గుబాటి అభిరామ్‌ ఇంకా కొందరు పాల్గొన్నారు. ఆరు స్క్రీన్స్ తో దిల్ సుఖ్ నగర్ లో నిర్మాణం జరుగుతున్న ఈ మల్టీప్లెక్స్‌ ను అతి త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పనులు జరుగుతున్నాయట.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here