Tamannah : చీర కడితే ఒక రేటు.. అలా కనిపిస్తే మరో రేటు.. తమన్నా డిమాండ్ మామూలుగా లేదుగా !

- Advertisement -

Tamannah : సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ కు వారు అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. అందరూ హీరోయిన్స్ ఇలాగే చేస్తారని కాదు కానీ కొంతమంది క్రేజ్ ఉన్న వాళ్లు మాత్రం పక్కాగా డిమాండ్ చేస్తారు. మరి ముఖ్యంగా యూత్ లో క్రేజ్.. ఇండస్ట్రీలో పాపులారిటీ ఉన్న హీరోయిన్లు అయితే ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా మేకర్స్ ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారు. కొంతమంది ఓపెన్ గా నా రేటు ఇది అంటూ డైరెక్టుగా డిమాండ్ చేస్తుంటారు.

మొదట ఆ జాబితాలోకే వస్తుంది తమన్నా. శ్రీ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏ క్షణంలోనైతే హ్యాపీ డేస్ సినిమా ఒప్పుకుందో కానీ అప్పటి నుంచి తమన్నా లైఫ్ లో అన్నీ హ్యాపీ డేసే. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది తమన్నా. ఇండస్ట్రీలోని దాదాపు అందరూ హీరోలతో చేసి ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే . రీసెంట్ గా అమ్మడు తన రేటు ని భారీ స్థాయిలో పెంచేసిందట. చీర కడితే ఒక రేటు.. బికినీ వేస్తే మరొకరేటు అంటూ కొత్త కొత్త కండిషన్స్ పెడుతుందట . జనరల్ గా తమన్నా ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది .

- Advertisement -

అదే వెబ్ సిరీస్ కైతే ఏకంగా ఏడు నుంచి పది కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది. ఇటీవల తమన్న శారీలో మాత్రమే కనిపిస్తే మూడు కోట్లు రెమ్యూనరేషన్ అని.. అదే బికినీ వేసి హాట్ సీన్స్ లో నటించాలి అంటే ఏడు కోట్ల రెమ్యూనరేషన్ పక్కా అంటూ తనను సంప్రదించిన మేకర్స్ కు ముందుగానే చెప్పేస్తుందట . ఇది తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ లు షాక్ అయిపోతున్నారు. అమ్మడులో ఈ యాంగిల్ కూడా ఉందా ..? అంటూ షాక్ అయి చూస్తున్నారు. మరికొందరు తమన్న అందాలు చూడడానికి ఎంతిచ్చినా తక్కువే అంటూ రెడీ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here