Yadamma raju: ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో వస్తున్న యాదమ్మ రాజు

- Advertisement -

Yadamma raju: యాదమ్మ రాజు అంటే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికి తెలుసు. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యేవాళ్ళకు ఇంకా పక్కాగా తెలిసి ఉంటాడు. అయితే ఈమధ్యన యాదమ్మ రాజు ఈ టీవీ ప్రోగ్రామ్స్ లలో ఎక్కువగా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే మూవీస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్న కారణంగా ఈ ప్రోగ్రామ్స్ లలో కనిపించడం లేదు. అయితే ఈటీవీలో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడే యాదమ్మ రాజులో మంచి యాక్టర్ కనిపించేవాడు. నాగబాబు, రోజా, రవి, శ్రీముఖి, అనసూయా ఇలా ప్రతి ఒక్కరు అతని ఉన్న యాక్టర్ ను మెచ్చుకునేవాళ్ళు.

who is my daddy web series
who is my daddy web series

యాదమ్మ రాజు ఇప్పటికే చాలా మూవీస్ లలో నటించాడు. జార్జ్ రెడ్డి మూవీలో కూడా నటించాడు. అయితే ఇప్పుడు యాదమ్మ రాజు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ వెబ్ సిరీస్ పేరు “హూ ఐస్ మై డాడీ”. ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆ ట్రైలర్ చాల ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ ఓపెన్ అవ్వడమే ఒక బ్యాంగర్ తో ఓపెన్ అవుతుంది. టైటిల్ ఉన్నట్టే యాదమ్మ రాజు సిరీస్ తన తండ్రి ఎవరో కనుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా న్యాచురల్ గా చేశారు. ట్రైలర్ లో డైలాగ్స్ కూడా చాల సహజంగా ఉన్నాయ్. వాటిని పత్రాలు చెప్పే విధానం కూడా బాగుంది.

yadamma raju
yadamma raju

ఈ వెబ్ సిరీస్ ను రాసింది, డైరెక్ట్ చేసింది వీ. రఘువీర్. అలాగే ఈ సిరీస్ ను శివజ్యోతి అండ్ గంగూలీ ప్రొడ్యూస్ చేశారు. సిరీస్ లో కెమెరా వర్క్, మ్యూజిక్ మొత్తం కూడా పాత్రలు నివస్తున్న ప్రదేశానికి, వాళ్ళు జీవిస్తున్న విధానానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉన్నాయ్. ఇంకా వెబ్ ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

- Advertisement -

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here