Kriti Sanon.. ఈ బాలీవుడ్ బ్యూటీ రోజురోజుకు తన అందంతో అభిమానులను మాయ చేస్తోంది. ప్రస్తుతం క్రూ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కృతి డిఫరెంట్ ఔట్ఫిట్స్లో సందడి చేస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కృతి ఎక్కువగా బోల్డ్ ఔట్ఫిట్స్నే చూజ్ చేసుకుంటోంది. తాజాగా కృతి పీచ్ కలర్ వెస్టర్న్ ఔట్ ఫిట్‌లో రచ్చ చేసింది. ఘాటు పోజులతో ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో కృతి బోల్డ్నెస్ మామూలుగా లేదు. హాట్ సమ్మర్లో తన హాట్‌నెస్‌తో ఈ బ్యూటీ చెమటలు పట్టించేస్తోంది.
కృతి ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అసలే సమ్మర్ హీట్‌తో చస్తుంటే నీ హాట్‌నెస్‌తో ఇలా చంపేస్తున్నావేంటి కృతి అంటూ కుర్రాళ్లు కొంటెగా రియాక్ట్ అవుతున్నారు. మరికొందరేమో ఇదేం ఔట్ఫిట్ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో బాలీవుడ్ బ్యూటీస్‌కు బోల్డ్నెస్ అలవాటే బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కృతి ఫ్యాన్స్ మాత్రం మా బ్యూటీ ఏ డ్రెస్ వేసినా అందంగానే ఉంటుందంటూ పొగిడేస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీస్‌తో తమ ప్రేమను కృతిపై కురిపించేస్తున్నారు.
కృతి సనన్ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ టాలీవుడ్లో ప్రభాస్‌తో ఆది పురుష్, మహేశ్ బాబుతో వన్ – నేనొక్కడినే, నాగచైతన్యతో కలిసి దోచెయ్లో కలిసి నటించింది. ఇక బాలీవుడ్లో ఈ భామ వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు అందుకుంటుంది. ఇటీవలే ఈ బ్యూటీ తేరి బాతోమే ఐసా ఉల్జా జియాతో హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు కరీనా కపూర్, టబుతో కలిసి క్రూలో నటిస్తోంది. ఇదే కాకుందా దో పత్తీ, హౌస్ ఫుల్5, గణ్‌పత్ వంటి సినిమాలతో బిజీగా ఉంది.