Venu swamy : సెలెబ్రిటీలకు జాతకాలు, సెలెబ్రిటీల ఇంట్లో పూజలు చేస్తూ వేణు స్వామి ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇక ఇతగాడు ప్రభాస్ మీద చేసే కామెంట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సలార్ సినిమా ఫ్లాప్ అంటూ చేసిన కామెంట్లు ఎంతటి వివాదానికి దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం . స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను ఓపెన్ గా బయటపెట్టేసే వేణు స్వామి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ స్టార్ క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను మాత్రమే తరచూ బయటపెట్టే వేణు స్వామి గతంలో ప్రభాస్ అభిమానులను బాగా హర్ట్ చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ భార్యపై అలాంటి కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను విమర్శించే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి వేణు స్వామి అనుష్క శర్మను వాడుకున్నాడు . స్టార్ క్రికెటర్లైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేర్లను ప్రస్తావిస్తూ రోహిత్ ప్రదర్శన గురించి కోహ్లీ భార్య గురించి సంచలన కామెంట్స్ చేశాడు .
“అనుష్కలాంటి అందమైన వైఫ్ ఉంది కాబట్టే విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు అంటే ఎలా ..?”అని ప్రశ్నించాడు వేణు స్వామి. ఆయనను తిట్టే హక్కు ఏ జ్యోతిష్యుడికి లేదు అని గట్టిగా ఇచ్చాడు. పరోక్షంగా అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ ను ఈ ఇష్యూలోకి లాగడం అభిమానులకి నచ్చడం లేదు. వెంటనే అనుష్క శర్మకు సారీ చెప్పాలి అంటూ విరాట్ కోహ్లీ ఫాన్స్ డిమాండ్ చూస్తున్నారు. కేవలం ఈ ఒక్క విషయమే కాదు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విషయాలలోనూ ఆయన గతంలో ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి . నయనతార, సమంత, నాగచైతన్య, రష్మిక మందన్నా లాంటి స్టార్స్ విషయాలను ఓపెన్గా బయటపెట్టేశాడు . ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వేణు స్వామి పేరు మారుమ్రోగిపోతుంది.