Surya Brother Karthi : సూర్య, జ్యోతిక ఈ రీల్ కపుల్ .. రియల్ కపుల్‌గా మారి చానా ఏళ్లయినా.. ఇప్పటికీ.. ది బెస్ట్ జోడీగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. సూర్య తన సినిమాలతో కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ నాట కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది. తన చిత్రాలతో మాస్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ఇక జ్యోతిక పెళ్లి, పిల్లలు.. కుటుంబ బాధ్యతలు వెరసి తెరకు కాస్త దూరంగా ఉన్నా.. 36 వయస్సులో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. తాజాగా బాలీవుడ్ మూవీ సైతాన్ చిత్రంతో హిట్ కొట్టింది. వీరిది ఉమ్మడి కుటుంబం అన్న సంగతి విదితమే. అయితే తాజాగా సూర్య ఫ్యామిలీ ముంబై షిఫ్ట్ అయ్యిందిద. ఇంట్లో అత్త, మామలకు పడదిని అప్పట్లో వార్తలు వచ్చాయి. అత్తమామలకు, కోడలికి పడటం లేదని ముఖ్యంగా సూర్య ఫాదర్, నటుడు శివకుమార్ .. జ్యోతికకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో బాలీవుడ్ షిప్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లికి ముందే సూర్య కొన్ని కండిషన్లు పెట్టారని కూడా పుకార్లు మామూలుగా రాలేదు. వివాహం తర్వాత ఆమె నటించడం మామకు ఇష్టం లేకపోవడంతోనే గొడవలు వచ్చాయని పుకార్లు సర్క్యులేట్ అయ్యాయి. సూర్య మాత్రం ముంబై టూ చెన్నై తిరుగుతున్నాడని తెలుస్తోంది.
ఈ విషయంపై తమ్ముడు నటుడు కార్తి స్పందించారు. ఈ రూమర్లను కొట్టిపారేస్తూ ఆమెను తల్లితో పోలుస్తూ.. పిల్లల చదువుల కోసమే అక్కడకు వెళ్లినట్లు చెప్పారు. ఎందుకు ఒక మంచి ప్యామిలీ గురించి ఇలా పుకార్లు రేపుతున్నారు. ఇది సరైన పద్దతి కాదుని చెప్పుకొచ్చాడు. ఎలాంటి ఫ్రూఫ్ లేకుండా అలా ఎలా సోషల్ మీడియాలో రాస్తారు? అని కార్తి సీరియస్ అయ్యాడు. గుమ్మం తొక్కలేదట.. సూర్య ఒక్కరే అక్కడకు.. ఇక్కడకు తిరుగుతున్నారట ఇవన్నీ అవసరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఈ మధ్య కాలంలో జ్యోతిక సోదరి.. ముంబయి వెళ్లి ఏదో ఆహ్వాన పత్రిక ఇచ్చిందని, అయినప్పటికీ.. తమిళనాడులో సైతాన్ నటి అడుగుపెట్టలేదని తెలుస్తోంది. భార్య మాట కాదనలేక ఆమెను బలవంతం పెట్టడం లేదట సూర్య కూడా. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే.. ప్రస్తుతం సైతాన్ మూవీ చేస్తుండగా.. ఈ సినిమా రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లలో భాగంగా జ్యోతిక చెన్నై వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ.. ఈ నటికి అత్తారింటి ముఖం చూడటమే ఇష్టం లేదన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఠాగూర్ నటి రెండు హిందీ చిత్రాలు చేస్తోంది. సూర్య కంగువ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు.