టాలీవుడ్ జెస్సీ Samantha కెరీర్ లో సూపర్ స్పీడ్ గా దూసుకెళ్తున్న తరుణంలో ఓ అరుదైన వ్యాధి ఆమె స్పీడ్ కు బ్రేక్ వేసింది. మయోసైటిస్ అనే వ్యాధితో తాను గత కొంతకాలంగా బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా వేదికగా అందరికీ చెప్పింది. కొద్దిరోజుల నుంచి లైమ్ లైట్ కి దూరంగా ఉన్న సామ్.. తాజాగా యశోద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సమంత.. జబ్బుతో తాను పోరాటం చేస్తున్న విధానం గురించీ.. తన సినిమా గురించీ మనసు విప్పింది.
“ఈమధ్యే నేను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్టుగా మన జీవితాల్లో కొన్ని మంచిరోజులు ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒకొక్క రోజు ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చానా అనిపిస్తుంది (సామ్ బోరున ఏడ్చేసింది). కానీ నేనొక్కటే కాదు, చాలా మంది నాలా పోరాడుతున్నారు. చివరికి గెలుపు మాత్రం మాదే.ఇది కష్టమైన స్థితే, ఇప్పటికీ నేను పోరాటం చేస్తున్నా. త్వరలోనే పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నా. ఈ క్షణం నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. ‘యశోద’ విడుదల గురించి ఇప్పుడు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా”. అని సామ్ ఈ ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయింది. సినిమా ప్రమోషన్ ఏమో కానీ.. సామ్ తన ఆరోగ్యం గురించి చెప్పిన మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ ఇంటర్వ్యూ చూసిన కొందరేమో సమంత ఓవరాక్షన్ చేసిందని విమర్శిస్తున్నారు. అయితే సామ్ తన ఆరోగ్యం గురించి మాట్లాడిన విషయంపై డైరెక్టర్ గీతాకృష్ణ రియాక్ట్ అయ్యారు. సమంతది అంతా డ్రామా అని ఆరోపించారు. ఇదంతా సినిమా కోసం ప్రమోషన్స్ స్ట్రాటెజీ అని అభిప్రాయపడ్డారు.
మోడల్ గా ఉన్నప్పటి నుంచి సమంత నాకు పరిచయం. కడలి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పుడు తనకు చర్మ సమస్యలున్నాయని.. ఆ మూవీ ఎక్కువ భాగం సముద్రం తీర ప్రాంతాల్లో షూటింగ్ ఉండటంతో దాని వల్ల ఇబ్బందలు ఎదురవుతాయని ఆ మూవీ నుంచి తప్పుకుంది. చర్మ సమస్యలున్నాయని సినిమానే వదులుకున్న ఆమె.. ఇప్పుడు ఇంత తీవ్రమైన అనారోగ్యం ఉంటే ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొంది. నిజంగా ఆమె వ్యాధి తీవ్రంగా ఉండి బాధపడితే ప్రమోషన్స్ లో పాల్గొనదు. ఇదంతా తన మీద జనాలకు సింపతీ క్రియేట్ చేయడానికే. అని గీతాకృష్ణ అన్నారు.
నాగచైతన్యతో విడాకులు.. ఆ తర్వాత పుష్పలో ఐటెం సాంగ్.. గ్లామర్ ఫొటో షూట్స్ తో సమంత తన ఇమేజ్ ని కోల్పోయిందని గీతాకృష్ణ అన్నారు. ఇప్పుడు తనపై ఉన్న నెగెటివ్ ఇమేజ్ చట్రం నుంచి బయటపడటి.. యశోద మూవీని హిట్ చేయడానికే తను ఈ డ్రామా ఆడిందని ఆరోపించారు.