Deepika Padukone, రణ్‌వీర్‌సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ వార్తలపై దీపిక, రణ్‌వీర్‌లు క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ జంట తమ రాబోయే బిడ్డ గురించి అందరితో షేర్ చేసుకున్నారు. దీపిక, రణ్‌వీర్‌ల అభిమానులు ఈ వార్తతో ఆనందంతో గంతులు వేస్తున్నారు. దీపిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేస్తూ అందరికీ శుభవార్త అందించింది.
దీపికా పదుకొనే,రణవీర్ సింగ్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. పోస్ట్‌లో దంపతులు సెప్టెంబర్ నెలను పేర్కొన్నారు. అంటే సెప్టెంబర్‌లో దీపిక తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ ఫోటో చుట్టూ చిన్న పిల్లలకు సంబంధించిన బట్టలు, చెప్పులు, షూస్ ఉన్నాయి. దీంతో ఆమె తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు అయింది. ఇక వీరు తమ మొదటి బిడ్డను సెప్టెంబర్ 2024వ సంవత్సరంలో తమ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. ఇక ఈ ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
గత కొన్ని రోజులుగా దీపిక గర్భం దాల్చడం చర్చనీయాంశమైంది. BAFTA అవార్డ్స్ 2024లో దీపిక చీరలో కనిపించినప్పుడు, అభిమానులు ఆమె బేబీ బంప్‌ని గమనించారు. ఆ సమయంలో ఆమె సబ్యసాచి వెండి సేక్విన్ చీరను కట్టుకుంది. ఇందులో ఆమె తన బేబీ బంప్‌ను దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. బాఫ్టా అవార్డ్స్‌కు హాజరైన తర్వాత ముంబై విమానాశ్రయంలో దీపిక కనిపించినప్పుడు ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ ఊహాగానాలు నిజమేనని దీపిక ప్రకటించింది. దీపికా పదుకొనే ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌ల్లో పని చేస్తున్నారు. సింగం రిటర్న్స్ సినిమాలో దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనుంది. దీపిక, ప్రభాస్ తో కలిసి కల్కి 2898 ADలో నటిస్తున్నారు.